![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fe/SatyenBose1925.jpg/640px-SatyenBose1925.jpg&w=640&q=50)
సత్యేంద్రనాథ్ బోస్
ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
సత్యేంద్రనాథ్ బోస్ (FRS) [1] (Bengali: সত্যেন্দ্র নাথ বসু) (జనవరి 1, 1894 - ఫిబ్రవరి 4,1974) భారత దేశ భౌతిక శాస్త్రవేత్త. ఈయన గణిత భౌతిక శాస్త్రంలో విశేష గుర్తింపు పొందాడు. అతను 1920 లలో క్వాంటం మెకానిక్స్లో బోస్-ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ సిద్ధాంతం నిర్మాణానికి గాను చేసిన కృషికి గుర్తింపు పొందాడు.అతనికి భారత ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణను 1954 లో ప్రదానం చేసింది. ప్రస్తుతం విశ్వంలో వ్యాపించిఉన్నాయని భావిస్తున్న దైవకణాలకు అతని పేరుతో హిగ్స్-బోసన్ కణాలని పాల్ డిరాక్[2] నామకరణం చేశాడు.[3][4][5]
సత్యేంద్రనాథ్ బోస్ Satyendra Nath Bose সত্যেন্দ্র নাথ বসু | |
---|---|
![]() 1925 లో సత్యేంద్రనాథ్ బోస్ | |
జననం | (1894-01-01)1894 జనవరి 1 కోల్కతా, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1974 ఫిబ్రవరి 4(1974-02-04) (వయసు 80) కలకత్తా, భారతదేశం |
నివాసం | ఇండియా |
జాతీయత | భారతీయుడు |
రంగములు | భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము |
వృత్తిసంస్థలు | కలకత్తా విశ్వవిద్యాలయం, ఢాకా విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | కలకత్తా విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | Bose–Einstein condensate Bose–Einstein statistics Bose gas |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మ విభూషణ్ Fellow of the Royal Society |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e3/Satyendra-nath-bose.jpg/640px-Satyendra-nath-bose.jpg)
అతను స్వయం బోధకుడు, బహుభాషా కోవిదుడు. అతను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, లోహ సంగ్రహణ శాస్త్రం, తత్వ శాస్త్రం, కళలు, సాహిత్యం, సంగీతం వంటి అనేక రంగాలలో కృషిచేశాడు. అతను స్వతంత్ర భారత దేశంలో అనేక పరిశోధనా కమిటీలలో పనిచేసి విశేష సేవలనందించాడు.