![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a3/PIA23791-Venus-RealAndEnhancedContrastViews-20200608_%2528cropped1%2529.jpg/640px-PIA23791-Venus-RealAndEnhancedContrastViews-20200608_%2528cropped1%2529.jpg&w=640&q=50)
శుక్రవారం
From Wikipedia, the free encyclopedia
శుక్రవారం (Friday) అనేది వారంలో ఆరవ రోజు.[1] ఇది గురువారంనకు, శనివారంనకు మధ్యలో ఉంటుంది.భారత పురాణాలలోని శుక్రదేవుని పేరుమీదుగా ఇది శుక్రవారం అని పిలువబడుతుంది. శుక్రవారాన్ని చాలామంది శుభదినంగా భావిస్తారు.శుక్రవారం ముస్లింలకు శుభదినంగా భావిస్తారు.[2] క్రిష్టియన్లుకు ఈష్టర్ పండగకు ముందు వచ్చే శుక్రవారంనాడు ప్రత్యేక ప్రార్థనా రోజుగా గుడ్ ఫ్రైడే అనే పేరుతో పండగను ఘనంగా జరుపుకుంటారు.[3] ఈ రోజున కొత్తపనులు ప్రారంభిస్తారు. తెలుగు చలన చిత్రసీమలో ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఎనలేనిది, ఎందుకంటే చాలావరకు కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, విడుదలలు శుక్రవారం రోజునే జరుగుతాయి.తెలుగువారికి (ముఖ్యంగా మహిళలకు) మంగళకరమైన శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a3/PIA23791-Venus-RealAndEnhancedContrastViews-20200608_%28cropped1%29.jpg/640px-PIA23791-Venus-RealAndEnhancedContrastViews-20200608_%28cropped1%29.jpg)