శివ (1989 సినిమా)
From Wikipedia, the free encyclopedia
టైటిల్ రోల్ ని అక్కినేని నాగార్జున పోషించిన శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
శివ (1989 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | రాంగోపాల్ వర్మ |
తారాగణం | అక్కినేని నాగార్జున , రాంజగన్, అమల , రఘువరన్, చిన్నా |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ స్టూడియోs & ఎస్.ఎస్.క్రియెషన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి