వ్యూహాత్మక బలగాల కమాండ్
క్షిపణుల ప్రయోగం, నిర్వహణ, నియంత్రణ చేసే భారత సైన్యపు విభాగం / From Wikipedia, the free encyclopedia
వ్యూహాత్మక బలగాల కమాండ్ (SFC) అనేది భారతదేశపు న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (NCA) లోని ఒక భాగం. కొండొకచో దీన్ని వ్యూహాత్మక న్యూక్లియర్ కమాండ్ అని కూడా అంటారు. దేశపు వ్యూహాత్మక అణ్వాయుధాల నిల్వలను నిర్వహించే బాధ్యత దీనిదే.[1] 2004 జనవరి 4 న వాజపాయ్ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది.[2] దీని మొట్టమొదటి కమాండర్-ఇన్-ఛీఫ్‌గా ఎయిర్ మార్షల్ తేజమోహన్ ఆస్థానా పనిచేసాడు.[3][4]