![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d2/Voyager.jpg/640px-Voyager.jpg&w=640&q=50)
వోయెజర్ 1
From Wikipedia, the free encyclopedia
వోయెజర్ 1 (ఆంగ్లం: Voyager 1) అనగా స్పేస్ ప్రోబ్ (అంతరిక్ష పరిశోధన యంత్రం), ఇది నాసాచే 1977 సెప్టెంబరు 5న బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం ప్రవేశపెట్టబడింది. నాలుగు దశాబ్దాలకు పైబడిన ఈ అంతరిక్షనౌక నేటికి నిరంతరంగా పనిచేస్తూ ఉంది, ఇది డీప్ స్పేస్ నెట్వర్క్ సమాచార వ్యవస్థతో సాధారణ ఆదేశాలను స్వీకరిస్తూ, తిరిగి డేటాను పంపిస్తుంది. ఇది భూమి నుండి సుదూరంగా ఉన్న మానవ నిర్మిత వస్తువు.
![]() వోయెజర్ 1, కు చెందిన పొడవుగా పెరిగి వ్యాప్తి చెందగల పరికరాలు (కుడివైపు), రేడియో ఐసోటోప్ ఉష్ణ విద్యుత్ జనరేటర్ (ఎడమవైపు). దీని యొక్క అధిక గెయిన్ యాంటెన్నా క్రింద గ్రహాంతరవాసులకు తెలియజేసేందుకు బంగారు రికార్డు ఉంచారు. | |
మిషన్ రకం | Outer planetary, heliosphere, and interstellar medium exploration |
---|---|
ఆపరేటర్ | నాసా / JPL |
COSPAR ID | 1977-084A[1] |
SATCAT no. | 10321[2] |
మిషన్ వ్యవధి | 46 years, 9 months, and 21 days elapsed Planetary mission: 3 years, 3 months, 9 days Interstellar mission: 43 years, 6 months, and 12 days elapsed (continuing) |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
తయారీదారుడు | Jet Propulsion Laboratory |
లాంచ్ ద్రవ్యరాశి | 721.9 కిలోగ్రాములు (1,592 పౌ.) |
శక్తి | 420 watts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | September 5, 1977, 12:56:00 (1977-09-05UTC12:56Z) UTC |
రాకెట్ | Titan IIIE |
లాంచ్ సైట్ | Cape Canaveral LC-41 |
Flyby of Jupiter | |
Closest approach | March 5, 1979 |
Distance | 349,000 కిలోమీటర్లు (217,000 మై.) |
Flyby of Saturn | |
Closest approach | November 12, 1980 |
Distance | 124,000 కిలోమీటర్లు (77,000 మై.) |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bd/Voyager_Golden_Record_fx.png/640px-Voyager_Golden_Record_fx.png)
ఇది రెండు గ్రహాల, వాటి చంద్రుల వివరణాత్మక చిత్రాలను అందించిన మొదటి ప్రోబ్. ఇది వాయేజర్ కార్యక్రమంలో భాగంగా, దాని సోదర క్రాఫ్ట్ వోయెజర్ 2 వంటిదే, ఈ అంతరిక్షనౌక బాహ్య హిలియోస్పిరీ (సూర్య అధిపత్య స్థల ప్రాంతం) ప్రాంతాలను, సరిహద్దులను గుర్తించడం, అధ్యయనం చేయడం కొరకు, చివరకు నక్షత్ర మాధ్యమాన్వేషణ ప్రారంభించబడేందుకు పొడిగించబడిన మిషన్.
"వాయేజర్ 1" 2012 ఆగస్టు 25న హిలియోపాస్ (సూర్య అధిపత్య స్థల ప్రాంతం)ను దాటి అంతర్ నక్షత్ర అంతరిక్షంలోకి ప్రవేశించినదని, ఇలా అంతర్ నక్షత్ర అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి మానవ నిర్మిత వస్తువు ఇదేనని 2013 సెప్టెంబరు 12న నాసా ప్రకటించింది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c6/Titan_3E_with_Voyager_1.jpg/640px-Titan_3E_with_Voyager_1.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ee/Voyager_Program_-_High-gain_antenna_diagram.png/640px-Voyager_Program_-_High-gain_antenna_diagram.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/07/Voyager_Program_-_spacecraft_diagram.png/640px-Voyager_Program_-_spacecraft_diagram.png)