అసోం రాష్ట్ర్రంలోని నూతనంగా ఏర్పడిన ఒక జిల్లా. From Wikipedia, the free encyclopedia
విశ్వనాథ్ జిల్లా, అసోం రాష్ట్ర్రంలోని నూతనంగా ఏర్పడిన ఒక జిల్లా. దీని ముఖ్య పట్టణం విశ్వనాథ్ చారియాలి. 2015, ఆగస్టు 15న అస్సాం ముఖ్యమంత్రి ప్రకటించిన కొత్త జిల్లాలలో ఇది ఒకటి.[2][3] పాత సోనిత్పూర్ జిల్లాలోని గోహ్పూర్, విశ్వనాథ్ సబ్ డివిజనులోని ఎక్కువ భాగం కలిపి ఈ జిల్లాగా ఏర్పాటు చేయబడింది. ఈ జిల్లాకు ఉత్తరాన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర జిల్లా గోలఘాట్, దక్షిణాన బ్రహ్మపుత్రా నది, తూర్పున లఖింపూర్ జిల్లా, పశ్చిమాన సోనిత్పూర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా పరిపాలన ప్రధాన కార్యాలయం విశ్వనాథ్ చారియాలి వద్ద ఉంది.
విశ్వనాథ్ జిల్లా | |
---|---|
అసోం రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
డివిజన్ | ఉత్తర అసోం |
జిల్లా ఏర్పాటు | 15 ఆగస్టు 2015 |
ముఖ్యపట్టణం | విశ్వనాథ్ చారియాలి |
Government | |
• డిఫ్యూటి కమీషనర్ | ప్రణబ్ కుమార్ శర్మ,[1] కమీషనర్ |
విస్తీర్ణం | |
• Total | 1,100 కి.మీ2 (400 చ. మై) |
Elevation | 48 - 849 మీ (157 - 2,787 అ.) |
జనాభా (2011) | |
• Total | 6,12,491 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | biswanath.gov.in |
16వ శతాబ్దంలో అహోమ్స్ చేజిక్కించుకునే వరకు చుటియా రాజ్యంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. జిల్లా పశ్చిమ భాగమంతా స్వతంత్ర భూయాన్ అధిపతుల పాలనలో ఉండేది. చుటియా రాజ్యం, భూయాన్ రాజ్యాల మధ్య డికారాయ్[4], గిలాధరి నదులు సరిహద్దులుగా గుర్తించబడ్డాయి.[5] చుటియా రాజులు ఈ ప్రాంతంలో అనేక కోటలను నిర్మించారు, ఇందులో బురోయ్ కోట (డఫ్లా కొండల సమీపంలో)[6], ప్రతాప్ కోటలను రాజు ప్రతాప్ నారాయణ్ నిర్మించాడు.[7][8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.