వాలిడి
From Wikipedia, the free encyclopedia
వాలిడి (హోమినోయిడియా) అనేది, పాత ప్రపంచంలో ఆఫ్రికా, ఆగ్నేయాసియాలకు చెందిన తోకలేని కోతి (సిమియన్). దీన్ని తోకలేని కోతి అని కూడా ఆంటారు. ఇవి పాత ప్రపంచపు కోతులకు సోదర సమూహాలు. ఈ రెండూ కలిసి కెటరైన్ క్లాడ్లో భాగం. ఇతర ప్రైమేట్ల కంటే భిన్నంగా వీటికి భుజం కీళ్ళ వద్ద చలనాలు ఎక్కువగా ఉంటాయి. సాంప్రదాయిక, సైన్సేతర ఉపయోగంలో, "వాలిడి", "తోక లేని కోతి" అనే పదానికి అర్థంలో మానవులు రారు. ఆ విధంగా, ఇది హోమినోయిడియా శాస్త్రీయ టాక్సన్ తో సమానం కాదు. హోమినోయిడియా సూపర్ ఫ్యామిలీలో రెండు శాఖలు ఉన్నాయి: గిబ్బన్లు లేదా చిన్న వాలిడులు; హోమినిడ్లు లేదా గొప్ప వాలిడులు.
- చిన్న వాలిడుల కుటుంబమైన హైలోబాటిడేలో నాలుగు ప్రజాతులు, మొత్తం పదహారు జాతుల గిబ్బన్లు ఉన్నాయి. ఇవన్నీ ఆసియాకు చెందినవి. అవి ఎక్కువగా చెట్లపై నివసిస్తాయి. నేలపై ఉన్నపుడు రెండు కాళ్ళపై నడుస్తాయి. వీటికి గొప్ప వాలిడుల కంటే తేలికైన శరీరాలుంటాయి. చిన్న సమూహాల్లో నివసిస్తాయి.
- గొప్ప వాలిడుల కుటుంబమైన హోమినిడే (హోమినిడ్స్) లో మూడు ప్రజాతులు (జీనస్లు) ఉన్నాయి. వీటిలో మూడు జాతులు ఉన్న ఒరంగుటాన్లూ వాటి ఉపజాతులూ, రెండు జాతుల గొరిల్లాలూ వాటి ఉపజాతులూ, రెండు జాతుల చింపాంజీలూ వాటి ఉపజాతులూ, ఒక జాతి మానవులు అందులో ఉన్న ఒకే ఒక్క ఉపజాతీ - ఇవన్నీ ప్రస్తుతం ఉనికిలో ఉన్నాయి. [1] [lower-alpha 1] [2] [3]
Hominoids or apes Temporal range: Miocene–Holocene PreꞒ
Ꞓ
O
S
D
C
P
T
J
K
Pg
N
| |
---|---|
Bornean orangutan (Pongo pygmaeus) | |
Scientific classification ![]() | |
Domain: | Eukaryota |
Kingdom: | జంతువు |
Phylum: | కార్డేటా |
Class: | క్షీరదాలు |
Order: | Primates |
Suborder: | Haplorhini |
Infraorder: | Simiiformes |
Parvorder: | Catarrhini |
Superfamily: | Hominoidea Gray, 1825 |
Type species | |
Homo sapiens Linnaeus, 1758 | |
Families | |
†Equatorius |
గొరిల్లాలు మానవులు తప్ప, మిగతా హోమినాయిడ్లన్నీ చెట్లు ఎక్కడంలో దిట్టలే. వాలిడులు రకరకాల మొక్కలు, జంతువులనూ తింటాయి. ఎక్కువగా మొక్కల ఆహారమే తింటాయి. వీటిలో పండ్లు, ఆకులు, కాండాలు, వేర్లు, గింజలు, గడ్డి గింజలూ ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, వివిధ రకాల నివాస ప్రాంతాల కారణంగా మానవుల ఆహారాలు ఇతర వాలిడుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. సంఖ్యలో మానవులే ఇప్పటివరకు వాలిడి జాతులన్నిటి లోకీ ఎక్కువ. వాస్తవానికి మిగతా అన్ని ప్రైమేట్ల కంటే మానవులు అనేక వేల రెట్లు ఎక్కువ.
మానవేతర హోమినాయిడ్లు చాలా అరుదు. ఉన్నవి కూడా అంతరించిపోతున్నాయి. అంతరించిపోతున్న చాలా జాతులకు ప్రధాన ముప్పు ఉష్ణమండల వర్షారణ్యాల్లో ఆవాసాలు తగ్గిపోవడం. అయితే కొన్ని జాతులు మానవుల ఆహారం కోసం బలైపోతున్నాయి. ఆఫ్రికా లోని గొప్ప వాలిడులు ఎబోలా వైరస్ నుండి కూడా ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికన్ వాలిడుల మనుగడకు గొప్ప ముప్పుగా పరిగణించబడుతున్న ఈ ఎబోలా, 1990 నుండీ జరిగిన మొత్తం గొరిల్లాలు, చింపాంజీల మరణాల్లో కనీసం మూడింట ఒక వంతుకు కారణమైంది. [4]