వల్లూరి బాలకృష్ణ
హాస్యనటుడు / From Wikipedia, the free encyclopedia
వల్లూరి బాలకృష్ణ తెలుగు సినీ హాస్యనటుడు. తెలుగు సినీ ప్రేక్షకులకు అంజిగాడుగా సుపరిచితుడు.[1]పాతాళభైరవి సినిమాలో ఆయన పోషించిన అంజిగాడు పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఈయన జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించారు.