లిథువేనియా
From Wikipedia, the free encyclopedia
55°N 24°E లిథువేనియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా) [11][12][13] ఇదిఐరోపాలో బాల్టిక్ సముద్రానికి ఆగ్నేయతీరాన ఉన్న మూడు దేశాలలో ఒకటి. దేశ ఉత్తర సరిహద్దులో లాత్వియా తూర్పు సరిహద్దులో బెలారస్, దక్షిణ సరిహద్దులో పోలాండ్ దేశాలు ఉన్నాయి.ఆగ్నేయంలో రష్యాకు చెందిన " కలినింగ్రాడ్ " భూభాగం ఉన్నాయి.2017 గణాంకాలను అనుసరించి లిథువేనియా జనసంఖ్య 2.8 మిలియన్లు.దేశంలో అతిపెద్ద నగరం, రాజధాని నగరం విలినియస్.లిథువేనియా ప్రజలను బాల్టిక్ ప్రజలుగా గుర్తిస్తారు.లిథువేనియన్ ప్రజలకు లిథువేనియన్, లత్వియా భాషలు (సజీవంగా ఉన్న బాల్టిక్ భాషా కుటుంబానికి చెందిన రెండు భాషలు) అధికార భాషలుగా ఉన్నాయి.
Republic of Lithuania Lietuvos Respublika (Lithuanian) | |
---|---|
గీతం: Tautiška giesmė National Hymn | |
Location of లిథువేనియా (dark green) – on the European continent (green & dark grey) | |
రాజధాని | Vilnius 54°41′N 25°19′E |
అధికార భాషలు | Lithuanian language |
జాతులు (2015[1]) |
|
పిలుచువిధం | Lithuanians |
ప్రభుత్వం | Unitary state semi-presidential republic[2][3][4][5] |
• President | Dalia Grybauskaitė |
• Prime Minister | Saulius Skvernelis |
• Seimas | Viktoras Pranckietis |
శాసనవ్యవస్థ | Seimas |
History of Lithuania from Russia / Germany (1918) | |
• First mention of Lithuania | 9 March 1009 |
• Coronation of Mindaugas | 6 July 1253 |
• Union of Krewo | 2 February 1386 |
• Polish–Lithuanian Commonwealth created | 1 July 1569 |
• Partitions of the Commonwealth | 24 October 1795 |
• Independence declared | 16 February 1918 |
• 1st Soviet occupation | 15 June 1940 |
• Nazi German occupation | 22 June 1941 |
• 2nd Soviet occupation | July 1944 |
• Independence restored | 11 March 1990 |
• Independence recognized by the Soviet Union | 6 September 1991 |
• Admitted to the United Nations | 17 September 1991 |
• Joined the European Union | 1 May 2004 |
విస్తీర్ణం | |
• మొత్తం | 65,300 కి.మీ2 (25,200 చ. మై.) (121st) |
• నీరు (%) | 1.35 |
జనాభా | |
• 2017 estimate | 2,821,674[6] (137th) |
• జనసాంద్రత | 43/చ.కి. (111.4/చ.మై.) (173rd) |
GDP (PPP) | 2017 estimate |
• Total | $90.632 billion[7] |
• Per capita | $31,935[7] (41st) |
GDP (nominal) | 2017 estimate |
• Total | $46.666 billion |
• Per capita | $16,443[8] (49th) |
జినీ (2015) | 37.9[9] medium |
హెచ్‌డిఐ (2015) | 0.848[10] very high · 37th |
ద్రవ్యం | Euro (€) (EUR) |
కాల విభాగం | UTC+2 (Eastern European Time) |
• Summer (DST) | UTC+3 (EEST) |
తేదీ తీరు | yyyy-mm-dd (Common Era) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +370 |
ISO 3166 code | LT |
Internet TLD | .lta |
|
శతాబ్దాలుగా బాల్టిక్ సముద్రపు ఆగ్నేయ తీరాలలో వివిధ బాల్టిక్ తెగలకు చెందిన ప్రజలు నివసించించారు. 1230 వ దశకంలో లిథువేనియా రాజు అయిన మిన్యుగూగాస్చేత మొట్టమొదటి సారిగా సమైక్యం చేయబడిన లిథియా సామ్రాజ్యం లిథువేనియా రాజ్యాలు 1253 జూలై 12 న సంయుక్త రాజ్యంగా ఏర్పాటు చేయబడింది. 14 వ శతాబ్దంలో గ్రాండ్ డచీ ఆఫ్ లిథువేనియా ఐరోపాలో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రస్తుత లిథువేనియా, బెలారస్, యుక్రెయిన్,, పోలాండ్, రష్యా ప్రాంతాలు గ్రాండ్ డచీ భూభాగాలు ఉన్నాయి. 1569 నాటి లిల్బన్ యూనియన్‌తో లిథువేనియా, పోలండ్ స్వచ్ఛందమైన రెండు-రాజ్యాల యూనియన్, పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ ను ఏర్పాటు చేసింది. కామన్వెల్త్ రెండు శతాబ్దాల వరకు కొనసాగింది, 1772-95 మధ్యకాలంలో పొరుగు దేశాలన్నీ రష్యన్ సామ్రాజ్యం లిథువేనియా భూభాగంలోని అత్యధిక భూభాగాలను విలీనం చేసుకుంది.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేసరికి లిథువేనియా స్వాతంత్ర్య చట్టం 1918 ఫిబ్రవరి 16న ఆధునిక లిథువేనియా స్థాపనను ప్రకటించింది. రెండవ ప్రపంచ యుద్ధం మధ్యలో లిథువేనియా మొట్టమొదటిగా సోవియట్ యూనియన్, నాజి జర్మనీ చేత ఆక్రమించబడింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి జర్మన్లు పదవీవిరమణ చేయగా సోవియట్ యూనియన్ లిథువేనియాను తిరిగి పొందింది. 1990 మార్చి 11 న సోవియట్ యూనియన్ అధికారిక రద్దుకు ముందు లిథువేనియా స్వతంత్రంగా ప్రకటించిన మొట్టమొదటి సోవియట్ రిపబ్లిక్‌గా మారింది. ఫలితంగా స్వతంత్ర దేశంగా లిథువేనియా పునరుద్ధరణ చేయబడింది.
లిథువేనియా యూరోపియన్ యూనియన్, యూరోప్ కౌన్సిల్, యూరోజోన్, స్కెంజెన్ ఒప్పందం, నాటో సంస్థలలో పూర్తిస్థాయి సభ్యదేశంగా ఉంది. ఇది నార్డిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సభ్యదేశం, ఉత్తర యూరోపియన్ దేశాల నోర్డిక్-బాల్టిక్ సహకార దేశాలలో భాగంగా ఉంది. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లిథువేనియాను "చాలా ఉన్నత మానవ అభివృద్ధి" దేశంగా గుర్తించబడుతుంది. లిథువేనియా యూరోపియన్ యూనియన్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది, 2017 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో ప్రపంచంలో 21 వ స్థానాన్ని పొందింది.