లక్సెంబర్గ్
From Wikipedia, the free encyclopedia
లక్సెంబోర్గ్ పశ్చిమ ఐరోపాలో ఉన్న ఒక భూ పరివేష్టిత దేశం. ఇది పశ్చిమసరిహద్దు, ఉత్తరసరిహద్దులో బెల్జియం ఉంది. తూర్పుసరిహద్దులో జర్మనీ, దక్షిణసరిహద్దులో ఫ్రాన్స్ ఉన్నాయి. లక్సెంబర్గ్ రాజధాని అయిన లక్సెంబగ్ నగరం బ్రసెల్స్, స్ట్రాస్‌బర్గ్ నగరాలతో యూరోపియన్ యూనియన్ మూడు రాజధాని నగరాలలో ఒకటిగా ఉంది.[7] యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రధాన కేంద్రంగా యురేపియన్ యూనియన్‌లో అత్యధిక న్యాయవ్యవస్థ అధికారం కలిగి ఉంది.లక్సెంబర్గ్ సంస్కృతి, ప్రజలు, భాషలు పొరుగు దేశాలతో బాగా ముడిపడివున్నాయి. ఇది ముఖ్యంగా ఫ్రెంచ్, జర్మనీ సంస్కృతుల మిశ్రమాన్ని కలిగి ఉంది. లక్సెంబర్గిష్, ఫ్రెంచ్, జర్మనీ అనే మూడు అధికారిక భాషలుగాన్నాయి. రెండవప్రపంచ యుద్ధసమయంలో జర్మనీ దండయాత్రలు పునరావృతం అయినకారణంగా ఫ్రాన్స్, జర్మనీ మధ్య మధ్యవర్తిత్వం కొరకు, ఇతర ప్రధానవిషయాలు యూరోపియన్ యూనియన్ పునాదికి దారి తీసాయి.[8] దేశవైశాల్యం 2,586 చదరపు కిలోమీటర్ల (998 చదరపు మైళ్ల). ఇది ఐరోపాలో అతి చిన్న సార్వభౌమ దేశాలలో ఒకటిగా ఉంది. ఇది సంయుక్త రాష్ట్ర " రోడ్ ఐలాండ్ లేదా ఉత్తర ఇంగ్లండ్షైర్ ఆంగ్ల కౌంటీ వైశాల్యానికి సమానం.[9] 2016 లో లక్సెంబర్గ్ జనసంఖ్య 5,76,249 కలిగి ఉంది. ఇది ఐరోపాలో అత్యల్ప-జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది.[10] అయినప్పటికీ అత్యధిక జనాభా పెరుగుదల కలిగిన దేశాలలో ఇది ఒకటిగా ఉంది.[11] ఒక రాజ్యాంగ రాజు ప్రతినిధి ప్రజాస్వామ్యంగా ప్రభుత్వానికి గ్రాండ్ డ్యూక్ హెన్రీ నాయకత్వం వహిస్తాడు. ప్రపంచంలో మిగిలిన ఉన్న ఏకైక గ్రాండ్ డచీ దేశంగా ఉంది. లక్సెంబోర్గ్ ఆధునిక ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో అత్యధిక జి.డి.పితో అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా ఉంది.లక్సెంబర్గ్ నగరంలో నిర్వహించిన పాత త్రవ్వకాలు, కోటలను 1994 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇందుకు విస్తారమైన కోట, పాత నగరాల అసాధారణమైన సంరక్షణ కారణంగా ఉన్నాయి.[12] లగ్జంబర్గ్ చరిత్ర 963 లో ప్రారంభం అయిందని భావిస్తున్నారు. మొదటి సీగ్ఫ్రీడ్ ట్రియర్ సమీపంలోని రోమన్ యుగపు కోట లూయిలిన్బర్హక్, 'లిటిల్ కాస్టిల్', చుట్టుపక్కల ప్రాంతాన్ని సెయింట్ మాక్సిమ్ ఇంపీరియల్ అబ్బీ నుండి అభ్యర్థించి పొందినట్లు భావిస్తున్నారు.[13][14] సీగ్ఫ్రీడ్ వారసులు వారి భూభాగాన్ని వివాహం, యుద్ధం, పరస్పర సంబంధాల ద్వారా విస్తరించారు.13 వ శతాబ్దం చివరలో లక్సెంబోర్గ్ కౌంట్స్ గణనీయమైన భూభాగాన్ని పాలించింది.[15] 7వ హెన్రీ లక్సెంబర్గ్ కౌంట్ జర్మన్లు , పవిత్ర రోమన్ చక్రవర్తి అయ్యాడు. మద్యయుగంలో లక్సెంబర్గ్ హౌస్ నాలుగు పవిత్ర రోమన్ చక్రవర్తులను తయారు చేసింది. 1354 లో 4వ చార్లెస్ కౌంటీని లూసియానాలోని డచీకి విస్తరించారు. సిగిస్మండ్‌కు మగ వారసుడు లేనందున డచీ బుర్గుండిన్ సర్కిల్లో భాగంగా మారింది, తరువాత లక్సెంబ్స్బర్గ్ నెదర్లాండ్స్‌లోని పదిహేడు ప్రోవిన్సుల్లో ఒకటిగా మారింది.[16] శతాబ్దాలుగా ఫ్రాన్స్, లక్సెంబర్గ్ భూభాగాల మధ్య గొప్ప వ్యూహాత్మక ప్రాముఖ్యత గల లక్సెంబర్గ్ నగరం, కోట క్రమంగా ఐరోపాలో అత్యంత ప్రసిద్ధ కోటలలో ఒకటిగా నిర్మించబడింది. 14 లూయిస్ ఫ్రాన్స్, ఆస్ట్రియాకు చెందిన మరియా థెరిస్సియా లక్సెంబోర్గ్ మొదటి ఫ్రెంచ్ రిపబ్లిక్, నెపోలియన్ సామ్రాజ్యంలో భాగంగా మారింది.[17] ప్రస్తుతము ఉన్న లగ్జంబర్గ్ దేశం మొదటిసారిగా 1815 నుండి వియన్నా కాంగ్రెస్‌లో ఉద్భవించింది. గ్రాండ్-డచీ శక్తివంతమైన కోటతో నెదర్లాండ్ చెందిన మొదటి విలియం పర్షియన్ సైన్యంతో స్వాధీనం చేసుకున్న తరువాత ఒక స్వతంత్ర దేశంగా మారింది.మరొకవైపు ఫ్రాన్స్ నుండి మరో దండయాత్ర కొనసాగింది.[18] 1839 లో బెల్జియన్ విప్లవం గందరగోళం తరువాత లక్సెంబర్గ్ పూర్తిగా ఫ్రెంచ్-మాట్లాడే భాగం బెల్జియానికి, లక్సెంబర్గ్-మాట్లాడే భాగం (అరెర్లండ్ ల్యాండ్, అరాన్ చుట్టుప్రక్కల ప్రాంతాన్ని మినహాయించి) లక్సెంబర్గ్ ప్రస్తుత దేశంగా మారింది.[19] 20 వ శతాబ్దం ప్రారంభంలో రెడ్ లాండ్స్ ఐరన్-ధాతువు మైదానాల రూపురేఖలను మారుస్తూ ఉక్కు పరిశ్రమ దేశాన్ని పారిశ్రామికీకరణ మార్గంలో నడిపింది. లక్సెంబర్గ్ నగరంలో ప్రధాన ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న ఆర్సెలర్ మిట్టల్ ఇప్పటికీ ఈ కాలంలోనే రిమైండర్‌గా ఉంది. 1970 లో ఉక్కు పరిశ్రమ క్షీణించిన తరువాత దేశాన్ని ప్రపంచ ఆర్థిక కేంద్రంగా, బ్యాంకింగ్ కేంద్రంగా అభివృద్ధి చెందింది. లక్సెంబర్గ్ విశ్వవిద్యాలయానికి నిధిసహాయం చేయడం ద్వరా లక్సెంబర్గ్ ప్రభుత్వం దేశాన్ని విఙానమార్గంలో పయనించజేయడానికి జాతీయ అంతరిక్ష కార్యక్రమ స్థాపన చేయడం మీద దృష్టిసారించి 21 వ శతాబ్దం ప్రారంభం నుండి 2020 నాటికి రోబోటిక్ చంద్రసంబంధమైన సాహసయాత్రలో మొట్టమొదటి ప్రమేయం కలుగజేసుకుంది.[20] లక్సెంబర్గ్ యూరోపియన్ యూనియన్ ఒ.ఇ.సి.డి. ఐక్యరాజ్యసమితి ఎన్.ఎ.టి.ఒ., బెనెలక్స్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఆర్థిక, రాజకీయ, సైనిక సమగ్రతకు అనుకూలంగా తన రాజకీయ ఏకాభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. దేశం రాజధాని, అతిపెద్ద నగరం అయిన లక్సెంబర్గ్ నగరం యురేపియన్ యూనియన్ అనేక సంస్థలు, సంస్థల కేంద్రంగా ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లక్సెంబర్గ్ 2013, 2014 సంవత్సరాల్లో సేవలు అందించింది. ఇది దేశ చరిత్రలో మొదటిదిగా ప్రత్యేకత సంతరించుకుంది.[21] 2016 లో లక్సెంబర్గ్ పౌరులు 172 దేశాలకు, భూభాగాల్లో వీసా రహిత లేదా వీసా-ఆన్ అరైవల్ అవకాశాన్ని కలిగి ఉన్నారు. ఇది కెనడా, స్విట్జర్లాండ్ వంటి దేశాలతో ప్రపంచంలో లక్సెంబర్గ్ పాస్‌పోర్ట్ 15 వ స్థానంలో ఉంది.[22]
Grand Duchy of Luxembourg | |
---|---|
జండా | |
నినాదం: "Mir wëlle bleiwe wat mir sinn" (Luxembourgish) "We want to remain what we are" | |
గీతం: "Ons Heemecht" "Our Homeland" Royal anthem: "De Wilhelmus"a | |
Location of Luxembourg (dark green) – on the European continent (green & dark grey) | |
రాజధాని | Luxembourg 49°36′N 6°7′E |
అధికార భాషలు | Luxembourgish French German[1] |
Nationality (2013) |
|
పిలుచువిధం | Luxembourgish, Luxembourger |
ప్రభుత్వం | Unitary parliamentary constitutional monarchy |
• Monarch (list) | Henri |
• Prime Minister (list) | Xavier Bettel |
• Deputy Prime Minister | Etienne Schneider |
శాసనవ్యవస్థ | Chamber of Deputies |
Independence | |
• from the French Empire and elevation to Grand Duchy of Luxembourg | 15 March 1815 |
• Independence in personal Union with the Netherlands Treaty of London) | 19 April 1839 |
• Reaffirmation of Independence Treaty of London | 11 May 1867 |
• End of personal union with the Kingdom of the Netherlands | 23 November 1890 |
• from the German Reich | 1944 / 1945 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,586.4 కి.మీ2 (998.6 చ. మై.) (168th) |
• నీరు (%) | 0.60% |
జనాభా | |
• January 2017 estimate | 590,667[3] (170th) |
• 2001 census | 439,539 |
• జనసాంద్రత | 222.8/చ.కి. (577.0/చ.మై.) (60th) |
GDP (PPP) | 2017 estimate |
• Total | $63.549 billion[4] (94th) |
• Per capita | $107,736[4] (2nd) |
GDP (nominal) | 2017 estimate |
• Total | $59.997 billion[4] (71st) |
• Per capita | $101,715[4] (3rd) |
జినీ (2014) | 28.7[5] low · 19th |
హెచ్‌డిఐ (2015) | 0.898[6] very high · 20th |
ద్రవ్యం | Euro (€)b (EUR) |
కాల విభాగం | UTC+1 (CET) |
• Summer (DST) | UTC+2 (CEST) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +352 |
ISO 3166 code | LU |
Internet TLD | .luc |
|