రోహ్తాంగ్ కనుమ
హిమాచల్ ప్రదేశ్‌లో పీర్ పంజాల్ శ్రేణి లోని కనుమ From Wikipedia, the free encyclopedia
హిమాచల్ ప్రదేశ్‌లో పీర్ పంజాల్ శ్రేణి లోని కనుమ From Wikipedia, the free encyclopedia
రోహ్తాంగ్ కనుమ ఎత్తైన పర్వత కనుమ (ఎత్తు 3,980 మీటర్లు). ఇది హిమాలయాల్లోని పీర్ పంజాల్ శ్రేణి తూర్పు చివరలో, మనాలి నుండి 51 కి.మీ. దూరంలో ఉంది. ఈ పేరుకు పార్సీ భాషలో శవాల దిబ్బ అని అర్థం. ఈ కనుమను దాటేందుకు ప్రయత్నించే ప్రజలు ఇక్కడి కల్లోల వాతావరణానికి బలైపోతున్న కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. [1] [2] [3] [4] ఈ కనుమ కులు లోయను హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్, స్పితి లోయలతో కలుపుతుంది.
రోహ్తాంగ్ కనుమ | |
---|---|
సముద్ర మట్టం నుండి ఎత్తు | 3,978 m (13,051 ft) |
ఇక్కడ ఉన్న రహదారి పేరు | లేహ్-మనాలి హైవే |
ప్రదేశం | భారతదేశం |
శ్రేణి | పీర్ పంజాల్, హిమాలయాలు |
Coordinates | 32°22′17″N 77°14′47″E |
హిందూ సంస్కృతి వ్యాపించిన కులు లోయకు (దక్షిణాన), బౌద్ధ సంస్కృతి ప్రధానంగా ఉండే లాహౌల్, స్పితి లోయల (ఉత్తరాన) కూ మధ్య సహజమైన విభజన రేఖగా ఈ కనుమ ఉంది. ఇది చీనాబ్, బియాస్ బేసిన్ల మధ్య ఉంది. కనుమ దక్షిణ భాగంలో, బియాస్ నది భూగర్భం నుండి ఉద్భవించి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. [5] దాని ఉత్తర భాగంలో, చీనాబ్ నది మూల ప్రవాహమైన చంద్ర నది (తూర్పు హిమాలయాల నుండి ప్రవహిస్తుంది) పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది.
ఈ కనుమ మే నుండి నవంబరు వరకు తెరిచి ఉంటుంది. హిమాలయాల ప్రమాణాల ప్రకారం చూస్తే ఇది పెద్ద ఎత్తులో ఏమీ లేదు. కాలినడకన దాటడం ఏమంత కష్టమూ కాదు, కానీ అనూహ్యంగా వచ్చే మంచు తుఫానుల కారణంగా ఇది ప్రమాదకరమైనదిగా పేరుపొందింది. [6]
ఈ కనుమ పిర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న ప్రజల మధ్య ప్రాచీన వాణిజ్య మార్గం. ఈ కనుమ స్థానిక పేరు, కనుమకు సాధారణంగా ఉండే పేరు. లాహాల్, స్పితిలలో నిర్దుష్టమైన పేర్లు ఉన్న అనేక ఇతర కనుమలు (కున్జామ్ లా, బరాలాచా లా, మొదలైనవి) ఉన్నాయి.. ఇది ఈ ప్రాంతంలోని ప్రాచీనమైన, తరచూ ప్రయాణాలు జరిగే కనుమ అయి ఉండడానికి లేదా ఇది ఒక సాంస్కృతిక ప్రాంతం నుండి ఉత్తరాన ఉన్న చాలా భిన్నమైన సాంస్కృతిక ప్రాంతానికి దారితీసే ప్రధాన కనుమ కావడానికి ఇది సూచన. రోహ్తాంగ్ అనే పేరు పెర్షియన్ / ఫార్సీ పదాల నుండి వచ్చింది రుహ్ + టాంగ్ అంటే శవాల దిబ్బ అని అర్థం.
పూర్వ జాతీయ రహదారి NH 21 (ఇప్పుడు NH 3 గా మారింది), కులు లోయ గుండా వెళ్ళి మనాలి వద్ద ముగుస్తుంది. రోహతాంగ్ పాస్ మీదుగా లాహౌల్, స్పితి జిల్లాలోని కీలాంగ్ వరకు, అక్కడి నుండి లడఖ్ లోని లేహ్ వరకూ వెళ్ళే రహదారి జాతీయ రహదారి కాదు. అయితే, 1999 నాటి కార్గిల్ యుద్ధం తరువాత వేసవి నెలల్లో ప్రత్యామ్నాయ సైనిక మార్గంగా లే-మనాలి హైవే చాలా బిజీగా మారింది. సైనిక వాహనాలు, ట్రక్కులు, వస్తు రవాణా వాహనాలు ఇక్కడి సన్నటి రోడ్లు, కఠినమైన భూభాగాల గుండా నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తుండటంతో ట్రాఫిక్ జామ్ లవడం మామూలైంది. కొన్ని ప్రదేశాలలో మంచు, ఐసు, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటక వాహనాలు మొదలైనవాటి వలన పరిస్థితి మరింతగా దిగజారింది..
హిస్టరీ ఛానల్ వారి ఐస్ రోడ్ ట్రక్కర్స్ సిరీస్ నుండి వచ్చిన ఐఆర్టి డెడ్లీయెస్ట్ రోడ్స్ శ్రేణి లోని అనేక ఎపిసోడ్లు రోహతాంగ్ కనుమ గుండా పోయే సరుకు రవాణా ట్రక్కులపై తీసారు.[7] సున్నితమైన రోహ్తాంగ్ లోయ పర్వత పర్యావరణంపై అక్కడ పెరిగిన ట్రాఫిక్ చూపే ప్రభావం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదలకు పర్యవసానంగా హిమానీనదాలు కరగడం కూడా తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. [8]
రోహ్తాంగ్ కనుమ వద్ద ధ్రువీయ శీతోష్ణస్థితి (కొప్పెన్ ET) ఉంటుంది. వేసవిలో కూడా కొన్నిసార్లు మంచు కురుస్తుంది.
కొన్నిసార్లు రోహ్తాంగ్ కనుమకు వెళ్ళడం కష్టం. అందువల్ల, మనాలిలో ఉన్న కోఠి గ్రామం నుండి రోహ్తాంగ్ కనుమ వరకు ఒక రోప్‌వే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రోప్‌వే ప్రారంభించడానికి అన్ని పనులను పూర్తి చేయాలని ఎన్జిటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రోప్‌వే ఏర్పడితే, వాహనాల నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. భారీ హిమపాతం శీతాకాలంలో రహదారిని అడ్డుకుంటుందికాబట్టి, అప్పుడు రోప్‌వే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. [9]
కనుమను మంచు కప్పివేయడంతో దీనిగుండా పోయే రహదారి నవంబరు నుండి మే వరకు మూసివేస్తారు. అందువలన కనుమకు ఉత్తరాన గల లాహౌల్, స్పితి జిల్లాల్లోకి వెళ్ళే వీలుండదు. దీంతో కనుమ కిందుగా ఒక సొరంగం నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. అటల్ సొరంగం అనే రహదారి సొరంగాన్ని 2020 అక్టోబర్ 3 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించాడు. దీంతో రోహ్తాంగ్ కనుమ మీదుగా ప్రయాణించవలసిన అవసరం తొలగిపోయింది. రోహ్తాంగ్ కనుమ ఎక్కడం, దిగడం వగైరాలకు 4 నుండి 6 గంటలు పడుతూండగా, రోహ్తాంగ్ సొరంగం గుండా ప్రయాణించడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.