![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c1/MDU_Main_Entrance_Gate.jpg/640px-MDU_Main_Entrance_Gate.jpg&w=640&q=50)
రోహ్తక్
హర్యానా రాష్ట్రం లోని నగరం / From Wikipedia, the free encyclopedia
రోహ్తక్ హర్యానా రాష్ట్రం లోని నగరం, రోహ్తక్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది న్యూ ఢిల్లీ నుండి 70 కి.మీ. దూరంలో ఉంది.రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి దక్షిణాన 250 కి.మీ. దూరంలో ఉంది. రోహ్తక్ జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్సిఆర్) భాగం. ఎన్సిఆర్ ప్లానింగ్ బోర్డు నుండి మౌలిక సదుపాయాల అభివృద్ధికి చౌక రుణాలు పొందడంలో ఈ హోదా నగరానికి ఉపయోగ పడుతుంది.[5]
రోహ్తక్ | |
---|---|
నగరం | |
![]() ఎం.డి. యూనివర్సిటీ | |
Coordinates: 28.8909°N 76.5796°E / 28.8909; 76.5796 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Haryana |
జిల్లా | రోహ్తక్ |
విస్తీర్ణం | |
• Total | 115 కి.మీ2 (44 చ. మై) |
• Rank | 5 |
Elevation | 220 మీ (720 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 3,74,292 |
• Rank | 119 |
• జనసాంద్రత | 3,300/కి.మీ2 (8,400/చ. మై.) |
భాషలు[2][3] | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 124 001 – 124 017 |
టెలిఫోన్ కోడ్ | 91 1262 XXX XXX |
లింగ నిష్పత్తి | 1.13[4] ♂/♀ |
2011 జనాభా లెక్కల ప్రకారం, 3,74,292 జనాభాతో రోహ్తక్, హర్యానాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఆరో స్థానంలో ఉంది.
ఖోఖ్రాకోట్ వద్ద కనుగొన్న నాణేల మట్టి దిబ్బలు పురాతన భారతదేశంలో నాణేలను అచ్చొత్తే ప్రక్రియపై వెలుగు ప్రసరించాయి. సా.శ. 3 వ లేదా 4 వ శతాబ్దానికి చెందిన యౌధేయుల నాణెం అచ్చులు పెద్ద సంఖ్యలో ఇక్కడ కనుగొన్నారు. ఆ కాలానికి, ఆ తరువాతి కాలాలకూ చెందిన అనేక మట్టి ముద్రలను కూడా అక్కడ కనుగిన్నారు. గుప్తుల కాలం నాటి టెర్రాకొట్టా ఫలకం, తరువాతి కాలం నాటి తలను కూడా ఇక్కడ కనుగొన్నారు. క్రీస్తుశకం 10 వ శతాబ్దం వరకు ఈ పట్టణం అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబూల్ హిందూ షాహి రాజవంశపు రాజు సామంత దేవుడి నాణేలు ఇక్కడ లభ్యమవడం ఇందుకు సాక్ష్యం.[6]