![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/76/Ronald_Ross.jpg/640px-Ronald_Ross.jpg&w=640&q=50)
రోనాల్డ్ రాస్
From Wikipedia, the free encyclopedia
సర్ రోనాల్డ్ రాస్ (13 మే, 1857 – 16 సెప్టెంబర్, 1932) బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. ఇతనికి మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను. 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది. 1897 లో ఒక దోమ యొక్క జీర్ణశయాంతర ప్రేగులలో మలేరియా పరాన్నజీవిని ఆయన కనుగొన్నప్పుడు మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని ఋజువు చేసింది. ఈ వ్యాధిని ఎదుర్కునే పద్ధతికి పునాది వేసింది. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను అనేక కవితలు రాసాడు, అనేక నవలలను ప్రచురించాడు. అతను పాటలను స్వరకల్పన చేసాడు. అతను కళాభిలాషి, గణిత శాస్త్రవేత్త కూడా. భారతీయ వైద్య సేవలో 25 సంవత్సరాలు పనిచేశాడు. తన సేవలోనే అతను సంచలనాత్మక వైద్య ఆవిష్కరణ చేశాడు. భారతదేశంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత, అతను లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అధ్యాపకులలో ఒకనిగా చేరాడు. 10 సంవత్సరాల పాటు ఇనిస్టిట్యూట్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ , చైర్మన్ గా కొనసాగాడు. 1926 లో అతను రాస్ ఇనిస్టిట్యూట్, హాస్పిటల్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ లకు డైరెక్టర్-ఇన్-చీఫ్ అయ్యాడు. ఇది అతని రచనలను గౌరవించటానికి స్థాపించబడింది. అతను చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు.[2][3] అతను హైదరాబాదు నగరంలో తన పరిశోధన జరిపాడు. ప్రస్తుతం "మినిస్టర్స్ రోడ్"గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు "సర్ రోనాల్డ్ రాస్ రోడ్" అనేవారు.40000-400000
రోనాల్డ్ రాస్ | |
---|---|
![]() | |
జననం | (1857-05-13)1857 మే 13 ఆల్మోరా, నార్త్-వెస్ట్ ప్రావిన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1932 సెప్టెంబరు 16(1932-09-16) (వయసు 75) లండన్, యు.కె |
జాతీయత | బ్రిటిష్ |
రంగములు | Medicine |
వృత్తిసంస్థలు | ప్రెసిడెన్సీ జనరల్ హాస్పటల్, కలకత్తా లివెర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసన్ కింగ్స్ కాలేజ్ హాస్పటల్ బ్రిటిష్ వార్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ పెన్షన్స్ అండ్ నేషనల్ ఇన్సూరెన్స్ రాస్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పటల్ ఫర్ ట్రాపికల్ డిసీజ్ |
చదువుకున్న సంస్థలు | సెయింట్ బర్తోలోమెవ్స్ హాస్పటల్ మెడికల్ కాలేజీ వర్షిప్ ఫుల్ సొసైటీ ఆఫ్ అపోథకరీస్ |
ప్రసిద్ధి | మలేరియా పారసైట్ జీవితచక్ర పరిశోధన |
ముఖ్యమైన పురస్కారాలు |
|
Author abbreviation (zoology) | రాస్ |