రేల ఒక రకమైన కాసియా (Cassia) జాతికి చెందిన చెట్టు. దీనిని అరగ్వద అని కూడా అంటారు.[1] దీని శాస్త్రీయ నామం కాసియా ఫిస్టులా (Cassia fistula). ఆకులు మెరపుతో కూడిన ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయలు నలుపులో గాని, పూర్తి ముదురు గోధుమ రంగులో గాని సన్నగా గుండ్రంగా ఉండి 50 నుండి 60 సెంటీమీటర్లు పొడుగు ఉండి వేలాడుతూ ఉంటాయి. ఇది ఎక్కువగా తేమ ప్రదేశాల్లోను, దట్టమైన అటవీ ప్రాంతాలలోను కనిపిస్తుంది. దీని పూలు బాగా అందంగా ఉండుట వలన ఉద్యానవనాల్లో, ఇంటి ముందు నాటుతారు.
త్వరిత వాస్తవాలు గోల్డెన్ షవర్ ట్రీ, Conservation status ...
గోల్డెన్ షవర్ ట్రీ |
|
పువ్వులతో ఉన్న రేల చెట్టు |
Conservation status |
Not evaluated (IUCN 3.1) |
Scientific classification |
Kingdom: |
ప్లాంటే |
Division: |
మాగ్నోలియోఫైటా |
Class: |
మాగ్నోలియోప్సిడా |
Subclass: |
రోసిడే |
(unranked): |
యూరోసిడ్స్ I |
Order: |
ఫాబాలెస్ |
Family: |
ఫాబేసి |
Subfamily: |
కేసల్పినియోడే |
Tribe: |
కాసియే |
Subtribe: |
కాసినే |
Genus: |
కాసియా |
Species: |
సి. ఫిస్టులా |
Binomial name |
సి. ఫిస్టులా
కార్ల్ లిన్నెయస్ |
మూసివేయి
- ఇది 7-8 మీటర్లు వరకు పెరిగే వృక్షం.
- సంయుక్త పత్రాలు అండాకారంగా ఉంటాయి.
- పుష్పాలు పసుపు రంగులో పొడవైన గుత్తులుగా వేలాడుతుంటాయి.
- పొడవైన ఫలాలు లావుగా ఉంటాయి. విత్తనాలకు మధ్య తియ్యటి గుజ్జు ఉంటుంది.
- ఈ చెట్టు అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగివున్నాయి. ముఖ్యంగా దీని కాయలు ఔషధాలలో విరివిగా వాడుతారు. పండిన ఈ కాయల నుండి తీసిన గుజ్జు సుఖ విరేచనం కోసం చిన్న పిల్లలు, గర్భవతులు కూడా తీసుకోదగిన ఔషధం. సుమారు 50 గ్రాముల గుజ్జును ఒక రాత్రి 150 గ్రాముల నీటిలో నానబెట్టి మరునాడు కాచి వడగట్టి 3 చెంచాల పంచదార కలిపి తాగితే అతి సులభంగా కాల విరేచనం అవుతుంది.
- రేల చెట్టు వేరు జ్వారాలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీని వేరును కాల్చి ఆ పొగను పీల్చాలి. దీనివల్ల జలుబు నీరుగా కారిపోయి తగ్గిపోతుంది. రేల ఆకులను కూడా ఈ విధంగా కాల్చి పొగ పీల్చవచ్చు.
- రేల వేరు పై పట్టను కాల్చి భస్మం చేసి ఉదయం, సాయంత్రం మంచినీళ్ళతో కలిపి వాడితే విషజ్వరాలు సైతం తగ్గిపోతాయి.
- కడుపులో వాత వాయువులు చేరి బాధిస్తున్నపుడు రేల కాయల గుజ్జును గాని, ఆకులను రుచ్చి గాని, బొడ్డు చుట్టూ పట్టు వేస్తే తగ్గిపోతుంది.
- బాదం నూనెతో గాని, ఆలివ్ ఆయిల్ తో గాని పై గుజ్జులను కలిపి పొట్ట పైభాగం అంతా మర్ధనా చేస్తే కూడా వాతవాయువులు తొలగిపోయి కాల విరేచనం అవుతుంది.
- మాదక ద్రవ్యాలు వాడిన వారికి నోటి రుచి తెలియకపోవడం జరుగుతుంది. ఈ వ్యాధికి 24 గ్రాముల రేల గుజ్జును గాని, ఆకుల గుజ్జును గాని 250 గ్రాముల పాలతో కలిపి పుక్కిట పట్టి నోటిని శుభ్రపరుస్తుంటే త్వరగా తగ్గిపోతుంది.
- రేల ఆకులను చర్మ రోగాలలో ఉపయోగిస్తారు. ఇది వాపులను నొప్పులను తగ్గిస్తుంది. ఆకుల రసాన్ని గాని, ఆకులను మెత్తగా రుచ్చి గాని చర్మంపై పట్టు వేస్తే చాలు.
- తామర, గజ్జి, అరికాళ్ళు, అరచేతులు మంటలు తగ్గుతాయి. ఈ రకమైన పట్టు వేయడం వల్ల ఉబ్బురోగం వల్ల శరీరంలో చేరిన చెడు నీటిని లాగేయడం జరుగుతుంది.[3]
- రేల ఆకులను మెత్తగా నూరి నొప్పి గల ప్రదేశాలలో బాగా మర్ధన చేస్తే నొప్పి తగ్గుతుంది. ఈ ప్రక్రియవల్ల మూతి వంకరపోవడం, కనురెప్పలకు ఒక భాగంలో వచ్చిన వాత వ్యాధి ఫెసియల్ పరాలిసిస్ తగ్గిపోతుంది.
- రేల ఆకులను గాని, పువ్వులను గాని, పచ్చడి గాను, పప్పు గాను వండుకుంటే కూడా పై వ్యాధుల వల్ల బాధ ఉండదు.
రేల చెట్టు
పూలగుత్తులు
పువ్వులోని కేసరాలు