![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0f/Rudyard_Kipling%252C_by_Elliott_%2526_Fry_%2528cropped%2529.jpg/640px-Rudyard_Kipling%252C_by_Elliott_%2526_Fry_%2528cropped%2529.jpg&w=640&q=50)
రుడ్యార్డ్ కిప్లింగ్
From Wikipedia, the free encyclopedia
రుడ్యార్డ్ కిప్లింగ్ (డిసెంబర్ 30, 1865 – జనవరి 18, 1936) ఆంగ్ల రచయిత, కవి. బొంబాయిలో జన్మించాడు. ఈయన రాసిన చాలా కథలను ఆంగ్ల చందమామ పుస్తకంలో ప్రచురితమైనాయి. 1894 లో ఆయన రాసిన ది జంగిల్ బుక్ అనే కథా సంకలనంతో ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువయ్యాడు. కథా సాహిత్యంలో ఆయన ఒక దార్శనికుడుగా కొనియాడబడ్డాడు.[1] బాల సాహిత్యంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది.[2][3] సాహిత్యంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 1907 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆంగ్ల రచయిత ఆయనే కావడం విశేషం. అంతే కాకుండా నోబెల్ బహుమతి నందుకున్న అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు.[4]
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రుడ్యార్డ్ కిప్లింగ్ | |
![]() | |
జననం: | 30 డిసెంబరు 1865 |
---|---|
వృత్తి: | కథా రచయిత, నవలా రచయిత, కవి, పాత్రికేయుడు |
జాతీయత: | ఆంగ్లేయుడు |
శైలి: | కథలు, నవలలు, బాల సాహిత్యం, కవిత్వం, యాత్రా సొహిత్యం, వైజ్ఞానిక కాల్పనికం |
ప్రభావితులు: | రాబట్ హెన్లీన్ , జార్జ్ లూయిస్ బోర్గర్స్ |
19 వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో యూకేలో ప్రాచుర్యం పొందిన రచయితల్లో కిప్లింగ్ కూడా ఒకడు.[1] హెన్రీ జేమ్స్ కిప్లింగ్ గురించి ఇలా అన్నాడు. "కిప్లింగ్ నాకు తెలిసిన వారిలోకెల్లా అత్యంత మేధావి, మంచి తెలివితేటలు గలవాడు".[1] బ్రిటిష్ నైట్ హుడ్ పొందే అవకాశం వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించాడు.[5] 1936 లో ఆయన చనిపోయిన తర్వాత వెస్ట్ మినిస్టర్ అబ్బే లోని పొయెట్స్ కార్నర్ లో ఆయన అస్థికలు భద్రపరిచారు.