From Wikipedia, the free encyclopedia
రాఘవ్ చద్దా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల ఇంచార్జిగా, ప్రస్తుతం ఢిల్లీలోని రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. రాఘవ్ చద్దా ను 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది.[3]
రాఘవ్ చద్దా | |||
రాజ్యసభ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 ఏప్రిల్ 2022 | |||
ముందు | ప్రతాప్ సింగ్ బజ్వా | ||
---|---|---|---|
నియోజకవర్గం | పంజాబ్ | ||
శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 12 ఫిబ్రవరి 2020 – ప్రస్తుతం | |||
ముందు | విజేందర్ గార్గ్ విజయ్ | ||
నియోజకవర్గం | రాజిందర్ నగర్ | ||
ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2 మార్చి 2020[1][2] | |||
ముందు | దినేష్ మొహానియా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ఢిల్లీ, భారతదేశం | 1988 నవంబరు 11||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | పరిణీతి చోప్రా | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ యూనివర్సిటీ | ||
వృత్తి | ఛార్టర్డ్ అకౌంటెంట్ | ||
వెబ్సైటు | Official Website |
రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2015లో పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితుడయ్యాడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. రాఘవ్ చద్దా 2020లో జరిగిన అఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజిందర్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] ఆయన 2020 మార్చి 2న ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.
రాఘవ్ చద్దా లో పంజాబ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ ఇన్చార్జ్గా నియమితుడై, 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల ఇంచార్జిగా పార్టీ గెలుపులో కీలకంగా పని చేశాడు. ఆయనను 2022 మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది.[5][6][7]
ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని కపుర్తాలా హౌస్‌లో ఆయన ఎంగేజ్మెంట్ (నిశ్చితార్ధం) బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో 2023 మే 13న జరిగింది.[8] వీరి వివాహం సెప్టెంబర్ 24న ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగింది. ఈ వివాహానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా హాజరైయ్యారు.[9][10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.