యోగి రామయ్య
From Wikipedia, the free encyclopedia
యోగి రామయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సంగం మండలం అన్నారెడ్డిపాలెం చెందిన ప్రసిద్ధ యోగి పుంగవుడు. శ్రీ రమణ మహర్షి అగ్రగణ్య శిష్యులలో ఇతను ఒకడు. శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమ కార్యక్రమాలలో భక్తులు వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. కొందరు ఆశ్రమ నిర్వహణా కార్యక్రమాలు , కొందరు భక్తుల, యాత్రికుల సేవకు, మరికొందరు భగవాన్ రమణుల పరిచర్యకు , కొందరు మేధావులు భగవాన్ రమణులు సూచించిన విచార మార్గం లో స్థిరంగా నిలిచి సాధన చేసారు. అటువంటివారిలో శ్రీ యోగి రామయ్య ఒకరు [1] ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉన్న ప్రపంచానికి శ్రీరమణ మహర్షిని పరిచయం చేసిన పుస్తకం "రహస్య భారతదేశంలో ఒక అన్వేషణ" (A Search in Secret India by Paul Brunton") అనే ఈ పుస్తక రచయత పాల్ బ్రంటన్ తాను ఎంతో ప్రశాంతతను శ్రీరామయోగి సాన్నిధ్యంలో అనుభవించినట్లు వ్రాసాడు.
త్వరిత వాస్తవాలు యోగి రామయ్య, జననం ...
యోగి రామయ్య | |
---|---|
![]() | |
జననం | మోపూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
నిర్యాణము | 1962 ఫిబ్రవరి 12 అన్నారెడ్డిపాలెం |
జాతీయత | భారతీయుడు |
స్థాపించిన సంస్థ | యోగి రామ తపోవనం & ఋషి మార్గ మిషన్ అన్నారెడ్డిపాలెం దువ్వూరు సంగం (నెల్లూరు జిల్లా) పిన్ - (524306) ph. 08622212484 |
గురువు | శ్రీబ్రహ్మనందతీర్ధులు, రమణ మహర్షి |
తత్వం | అద్వైతం |
ప్రముఖ శిష్యు(లు)డు | శ్రీ ప్రజ్ఞారణ్యస్వామి ( యోగి ప్రోటొప్లాజమ్) |
తండ్రి | చేవూరి పిచ్చిరెడ్డి |
మూసివేయి