మొనాకో
From Wikipedia, the free encyclopedia
మొనాకో (/ˈmɒnəkoʊ/ ( listen); French pronunciation: [mɔnako]), అధికారికంగా " ప్రిసిపాలిటీ ఆఫ్ మొనాకో " (French: Principauté de Monaco),[lower-alpha 1] అన్నది స్వార్వభౌమాధికారం కలిగిన నగర రాజ్యం, దేశం, దీనికి మైక్రో స్టేట్ అన్న ప్రత్యేకత ఉంది. ఇది పశ్చిమ యూరప్‌లో " ఫ్రెంచి రివేరా "లో ఉంది. దేశానికి మూడు వైపులా ఫ్రెంచి దేశ సరిహద్దు ఉంది. నాలుగవ వైపు మద్యధరా సముద్రం ఉంది. 2016 నాటి గణాంకాల ఆధారంగా మొనాకో జనసంఖ్య 38,400[5] యూరప్‌లో పర్యాటకులని ఆకర్షించే ఓ చిన్న దేశం ఇది. మొనాకో ప్రపంచంలోని రెండవ అతి చిన్న దేశం, ప్రపంచంలో అధిక జనసాంద్రత గల దేశం. ఫ్రాన్స్, ఇటలీల మధ్యగల మొనాకో విస్తీర్ణం 2.02 చదరపు కిలోమీటర్లే. ప్రపంచంలో అధిక కాలం జీవించేది కూడా మొనాకో దేశస్తులే. సరాసరి ఆయుఃప్రమాణం 90 సంవత్సరాలు. నిరుద్యోగం సున్నా శాతం. ఫ్రాన్స్, ఇటలీల నించి ప్రతిరోజూ ఈ దేశంలోకి నలభై వేల మంది ఉద్యోగులు వచ్చి పనిచేసి వెళ్తూంటారు. మద్యధరా సముద్ర తీరాన గల మొనాకోకి 0.7 కిలోమీటర్ల విస్తీర్ణం మేర సముద్రాన్ని పూడ్చి భూభాగాన్ని పెంచారు. జనసాంద్రత చ.కి.మీ.కు 19 వేలమంది. మొనాకో భూభాగ సరిహద్దు పొడవు " 5.47 కి.మీ ".[5] సముద్రతీరం పొడవు 3.83 కి.మీ.వెడల్పు 1700-349 మీ. దేశంలో అత్యత ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతున్న ఇరుకైన కాలిబాట పేరు " చెమిన్ డెస్ రివోరీస్ ", ఇది " మోంట్ ఎజెల్ " పర్వతసానువుల్లో ఉంది. మొనాకోలోకెల్లా అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం "మోంటే కార్లో ", అత్యంత జనసాంద్రత కలిగిన వార్డ్ " లార్వొట్టో ". లాండ్ రిక్లైమేషన్ ద్వారా మొనాకో వైశాల్యం 20% పెంచుకుంది. 2005 లో దేశవైశాల్యం 1.974 చ.కి.మీ. మొనాకోలోని పన్ను చట్టాల వల్ల దీన్ని సంపన్నులకు క్రీడాస్థలం అంటారు. 2014 గణాంకాల ఆధారంగా దేశంలో 30% ప్రజలు మిలియనీర్లుగా ఉన్నారు. ఇది జెనీవా, జ్యూరిచ్ కంటే అధికం. [9]
నినాదం: "Deo Juvante" (Latin) "దేవుని సహాయంతో" | |
గీతం: Hymne Monégasque English: Monégasque Anthem | |
రాజధాని | మొనాకో[a][1][2] |
అతిపెద్ద క్వార్టియర్ | మొంటె కార్లో |
అధికార భాషలు | ఫ్రెంచి[3] |
సాధారణ భాషలు |
|
జాతులు |
|
పిలుచువిధం |
|
ప్రభుత్వం | యూనిటరీ పార్లమెంటరీ రాజ్యాంగ రాచరికం |
• మొనార్క్ | రెండవ ఆల్బర్ట్ |
• మినిస్టర్ ఆఫ్ స్టేట్ | మైకేల్ రోజర్ |
• ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ | లారెంట్ నోవియోన్ (ఆర్.ఇ.ఎం.) |
శాసనవ్యవస్థ | నేషనల్ కౌన్సిల్ |
స్వతంత్ర దేశం | |
• హౌస్ ఆఫ్ గ్రిమాల్డి | 1297 |
• ఫ్రాంకో-మానెగాస్క్ ఒప్పందం | 1861 |
• రాజ్యాంగం | 1911 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2.02 కి.మీ2 (0.78 చ. మై.) (248వ) |
• నీరు (%) | నామమాత్రం[4] |
జనాభా | |
• 2011 estimate | 36,371[5] (217వ స్థానం) |
• 2008 census | 35,352[4] |
• జనసాంద్రత | 18,005/చ.కి. (46,632.7/చ.మై.) (1వ స్థానం) |
GDP (PPP) | 2010[b] estimate |
• Total | $4.694 బిలియన్[6][7] (156వ స్థానం) |
• Per capita | $132,571[6][7] (1వ స్థానం) |
GDP (nominal) | 2010[b] estimate |
• Total | $5.424 billion[6] (148వ స్థానం) |
• Per capita | $153,177[6] (1వ స్థానం) |
ద్రవ్యం | Euro (€) (EUR) |
కాల విభాగం | UTC+1 (సెంట్రల్ యూరోపియన్ టైం) |
• Summer (DST) | UTC+2 (సెంట్రల్ యూరోపియన్ సమ్మర్ టైం) |
వాహనాలు నడుపు వైపు | కుడిపక్కన[8] |
ఫోన్ కోడ్ | +377 |
Internet TLD | .mc |
మొనాకో రాజ్యాంగ రాచరికం పాలనలో రాజ్యాధిపత్యం ప్రిన్స్ రెండవ ఆల్బర్ట్ ఆధిపత్యంలో ఉంది. ప్రిన్స్ రెండవ ఆల్బర్ట్ రాజ్యాంగబద్ధమైన రాజు మాత్రమే అయినప్పటికీ అతను స్వయంగా అపారమైన రాజకీయ శక్తిని సంపాదించుకున్నాడు. గ్రిమాల్డీ హౌస్ వంశం మధ్యలో కొద్ది కాలం మినహా 1297 నుంచి మొనాకోను పాలించింది. [10] అధికారిక భాష ఫ్రెంచ్ కానీ మోనెగస్క్యూ ఇటాలియన్, ఇంగ్లీష్ భాషలు విస్తృతంగా మాట్లాడతారు. 1861 ఫ్రాంకో-మొనెగాస్క్ ఒప్పందం ద్వారా దేశసార్వభౌమాధికారం అధికారికంగా గుర్తించబడింది, ఐక్యరాజ్యసమితిలో పూర్తి ఓటింగ్ సభ్యదేశాల్లో ఒకటిగా 1991లో చేరింది. మొనాకో స్వాతంత్ర్యం, స్వంత విదేశాంగ విధానం ఉన్నప్పటికీ దాని రక్షణకు ఫ్రాన్స్ బాధ్యత వహిస్తుంది. అయితే మొనాకో రెండు చిన్న సైనిక విభాగాలను నిర్వహిస్తుంది.
19వ శతాబ్దం చివర్లో దేశం మొట్టమొదటి కాసినో "మోంటే కార్లో "ను, ప్యారిస్‌కు రైల్వే అనుసంధానాన్ని ప్రారంభించడం ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహకరమైంది.[11] అప్పటి నుండి మొనాకో తేలికపాటి వాతావరణం, మనోహర ప్రకృతి దృశ్యాలు, జూద వినోద సౌకర్యాల వల్ల మొనాకో సంపన్నుల పర్యాటక వినోద కేంద్రం అయింది. ఇటీవలి సంవత్సరాల్లో మొనాకో ఒక ప్రధాన బ్యాంకింగ్ కేంద్రంగా మారింది, సేవల రంగం, చిన్న పరిశ్రమలలో విస్తరించాలని ఆశిస్తోంది. దేశంలో ఎటువంటి ఆదాయపు పన్ను లేదు. వాణిజ్య పన్నులు తక్కువగా ఉంటాయి. ఈ విధానం వల్ల ఇది ప్రపంచంలోని ట్యాక్స్ హెవెన్స్ (పన్నుల స్వర్గాలు)లో ఒకటిగా నిలుస్తోంది. ఇది మొనాకో గ్రాండ్ ప్రిక్స్ అనే ఫార్ములా వన్ ఒరిజినల్ గ్రాండ్స్ ప్రిక్స్కి వేదిక.
మొనాకో అధికారికంగా యూరోపియన్ యూనియన్‌లో భాగం కాదు, కానీ ఇది కస్టమ్స్, సరిహద్దు నియంత్రణలతో సహా కొన్ని ఇ.యు. విధానాలను స్వీకరించింది. ఫ్రాన్స్‌తో దాని అనుబంధం వల్ల మొనాకో తన ఏకైక కరెన్సీగా యూరోను ఉపయోగిస్తుంది (దీనికి ముందు ఇది మోనెగాస్క్ ఫ్రాంక్‌ని ఉపయోగించేది). మొనాకో 2004 లో ఐరోపా కౌన్సిల్లో చేరింది. ఇది ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకోఫొనీ (ఒ.ఐ.ఎఫ్ ) సంస్థలో సభ్యదేశంగా ఉంది.