మూర్ఛలు (ఫిట్స్)
హఠాత్తుగా స్పృహ కోల్పోయే నాడీమండల వ్యాధి, అనగా మెదడు,నరాలకు సంభందించిన వ్యాధి From Wikipedia, the free encyclopedia
హఠాత్తుగా స్పృహ కోల్పోయే నాడీమండల వ్యాధి, అనగా మెదడు,నరాలకు సంభందించిన వ్యాధి From Wikipedia, the free encyclopedia
మూర్ఛ వ్యాధి (ఆంగ్లం:Fits,Epilepsy) అనగా హఠాత్తుగా స్పృహ కోల్పోయే వ్యాధి.ఇది నాడీమండల వ్యాధి...అనగా మెదడు,నరాలకు సంభందించిన వ్యాధి. మూర్ఛ అనేది దీర్ఘకాలిక రుగ్మత, ఇది ప్రేరేపించని, పునరావృత మూర్ఛలకు కారణమవుతుంది. [1]
మూర్చ పోయే ముందు తీవ్రమైన వణుకులు,నోటి నుండి చొంగ కారుట ఒక్కోసారి నాలుక కరుచుకొనుట జరుగును.ఆ తర్వాత కొంత సేపటికి మరల మామూలు స్థితికి వస్తారు. మూర్ఛ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. జ్వరం ఎక్కువగా రావడం , తలకు దెబ్బలు తాకడం , శరీరం లో చక్కెర తగ్గడం ( low sugar ) వంటివి. మూర్చలలో రెండు రకాలు అవి )మొదటిది మామూలు స్థితిలో ఉన్నప్పుడు వచ్చు మూర్ఛ, రెండవది నిద్రలో ఉన్నప్పుడు వచ్చు మూర్ఛ . సాధారణ మూర్ఛలు మొత్తం మెదడును ప్రభావితం చేస్తాయి. ఫోకల్, లేదా పాక్షిక మూర్ఛలు మెదడులోని ఒక భాగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయి. అవగాహన లేని కొన్ని సెకన్ల పాటు ఉంటుంది,బలమైన మూర్ఛలు దుస్సంకోచాలు, అనియంత్రిత కండరాల మెలికలను కలిగిస్తాయి, కొన్ని సెకన్ల నుండి చాలా నిమిషాల వరకు ఉంటాయి. ఈ సమయంలో కొంతమంది గందరగోళం చెందుతారు, స్పృహ కోల్పోతారు. తరువాత అది జరుగుతున్నట్లు జ్ఞాపకం ఉండకపోవచ్చు.
మూర్ఛ యొక్క కారణానికి చికిత్స చేయడం ద్వారా, భవిష్యత్తులో మూర్ఛలు రాకుండా అప్రమత్తంగా ఉండ వచ్చును . మూర్ఛలకు చికిత్సలో ఇవి ఉన్నాయి: మెదడు లో లోపాలు సరిచేయడానికి శస్త్రచికిత్స,నరాల ప్రేరణ, కీటోజెనిక్ డైట్ అని పిలువబడే ప్రత్యేక ఆహారం [2]
livoda drug is very effectively used in world but its having more side effects
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.