2003 సినిమా From Wikipedia, the free encyclopedia
మిస్సమ్మ నీలకంఠ దర్శకత్వం వహించగా 2003 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇందులో శివాజీ, లయ, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు. 2003లో ఈ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ రచయిత, ఉత్తమ నటి, ఉత్తమ డబ్బింగ్ విభాగంలో మూడు నంది పురస్కారాలు అందుకున్నది.[2]
మిస్సమ్మ | |
---|---|
దర్శకత్వం | నీలకంఠ |
స్క్రీన్ ప్లే | నీలకంఠ |
కథ | నీలకంఠ |
నిర్మాత | బి.సత్యనారాయణ, వింధ్యాల ఫణిశేఖర్ రెడ్డి |
తారాగణం | లయ, భూమిక, శివాజీ (నటుడు), తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, ఎల్.బి.శ్రీరామ్, బెంగుళూరు పద్మ |
ఛాయాగ్రహణం | జవహర్ రెడ్డి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | సత్య ఎంటర్ టైన్ మెంట్స్ |
విడుదల తేదీ | నవంబరు 28, 2003 |
భాష | తెలుగు |
నందగోపాల్ అలియాస్ నందు (శివాజీ) జె. పి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే సంస్థ, హైదరాబాదులో అకౌంటెంటుగా పనిచేస్తుంటాడు. చేసేది చిన్న ఉద్యోగమైనా అతని హృదయం విశాలమైంది. తనకొచ్చే జీతంలో పాతిక శాతం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంటాడు. అతని భార్య రత్నమాల (లయ). వారిద్దరూ పిల్లలు వద్దనుకుని ఒక అనాథ అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు. ఒకసారి కంపెనీకి ఛైర్మన్ మేఘన (భూమిక) కంపెనీ ప్రధాన కార్యాలయమైన ముంబై నుంచి హైదరాబాదుకు వస్తుంది. నందగోపాల్ ఆమె దగ్గర మంచి పేరు సంపాదించి పదోన్నతి పొందాలని వ్యాపార సంస్థలు సామాజిక సేవ ద్వారా ఎలా అభివృద్ధి చెందవచ్చో అనే అంశంపై తాను రాసిన థీసిస్ ను ఆమెకు ఇస్తాడు. ఆమె దాన్ని చదివి అతన్ని ఇంటికి పిలిపిస్తుంది.
ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆకాశానికి ఆశల నిచ్చెన అనే పాట పాతాళభైరవి సినిమాలో ప్రాచుర్యం పొందిన ప్రేమ కోసమై వలలో పడెనే అనే పాట బాణీలో స్వరపరచబడింది. ఇందులో కథా నాయకుడి మనోభావాలను వ్యక్తపరచడానికి దర్శకుడు నీలకంఠ మూకాభినయ (మైమ్) కళాకారులకు వాడుకున్నాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.