మిస్ వరల్డ్ (ఆంగ్లం: Miss World) అత్యంత పురాతనమైన అంతర్జాతీయ అందాల పోటీ. ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లో 1951లో ఎరిక్ మోర్లీచే ప్రారంభించబడింది.[1][2] 2000లో అతను మరణించిన తరువాత అతని భార్య జూలియా మోర్లీ ఈ పోటీలకు సహ-అధ్యక్షురాలుగా ఉన్నారు.[3][4] మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్‌లతో పాటు, ఈ పోటీ బిగ్ ఫోర్ అంతర్జాతీయ అందాల పోటీలలో ఒకటి.[5]

త్వరిత వాస్తవాలు ఆశయం, స్థాపన ...
మిస్ వరల్డ్
Thumb
ఆశయంఅందం - ఒక ప్రయోజనం
స్థాపన29 జూలై 1951; 73 సంవత్సరాల క్రితం (1951-07-29)
రకంఅందాల పోటీ
ప్రధాన
కార్యాలయాలు
లండన్
కార్యస్థానం
అధికారిక భాషఆంగ్లం
అధ్యక్షులుజూలియా మోర్లీ
ముఖ్యమైన వ్యక్తులుఎరిక్ మోర్లీ
మూసివేయి

మిస్ వరల్డ్ 2021

ఇది మిస్ వరల్డ్ పోటీల 70వ ఎడిషన్. ప్రస్తుత ప్రపంచ సుందరి పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా(Karolina Bielawska), ఆమె 2022 మార్చి 16న ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో జమైకాకు చెందిన టోని-ఆన్ సింగ్ చేత పట్టాభిషేకం చేయబడింది.[6] ప్రపంచ సుందరి గెలుచుకున్న రెండవ పోలిష్ ఆమె.[7]

23 ఏళ్ళ కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. తాను పీహెచ్‌డీ చదవాలని భావిస్తున్నట్లు తెలిపింది. కరోలినా మోడల్‌గా కూడా పనిచేస్తోంది. ప్రపంచ సుందరిగా ఎంపికైన కరోలినాకు స్విమ్మింగ్, స్కూబా డైవింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడటం అంటే ఎంతో ఇష్టమట.[8]

విజేతలు

  1. 2003: రోసన్నా డేవిసన్


మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.