From Wikipedia, the free encyclopedia
మిషిగన్ సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు వైపున ఉత్తరాన ఉన్న రాష్ట్రం. రాష్ట్రానికి ఆ పేరు మిషిగన్ సరస్సు నుండి వచ్చింది. మిషిగన్ అనగా "ఎక్కువ నీరు" లేక "పెద్ద సరస్సు" అని అర్థం.[1][2] దాదాపు కోటి మంది జనాభాతో మిషిగన్ అమెరికాలో అత్యధిక జనాభా గల రాష్ట్రాల్లో పదవ స్థాన్ంలో ఉంది. అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రాల్లో 11వ స్థానంలో ఉంది.[lower-alpha 1] దీని రాజధాని లాన్సింగ్. అరిపెద్ద నగరం డెట్రాయిట్. మెట్రో డెట్రాయిట్ దేశం లోని అతిపెద్ద మెట్రోల్లో ఒకటి.
ఈరీ, హ్యూరాన్, మిషిగన్, సుపీరియర్ అనే నాలుగు మహా సరస్సులతో పాటు, సెయింట్ క్లెయిర్ అనే సరస్సుతో మొత్తం అయిదు సరస్సులను కలిగి, ప్రపంచంలో అతి పొడుగైన తాగు నీటి తీరం ఉన్న రాష్ట్రం ఇది.[3] ఇవే కాక, మిషిగన్లో మొత్తం 64,980 సరస్సులు, చెరువులూ దొరువులూ ఉన్నాయి.[4]
మిషిగన్ రాష్ట్రం రెండు విడి భాగాలుగా ఉంటుంది. ఈ రెంటినీ ఐదు మైళ్ళ వెడల్పు గల మెకినాక్ జలసంధి వేరు చేస్తుంది. ఈ జలసంధి మిషిగన్ సరస్సును, హ్యురాన్ సరస్సునూ కలుపుతూ ఉంది. పొడవు గల మెకినాక్ వంతెనతో కలుపబడి ఉంది. 1846లో మరణశిక్షను రద్దు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మిషిగన్.
2019 జూలై 1 నాటికి మిషిగన్ జనాభా 99,86,857. ఇది 2010 జనాభాతో పోలిస్తే 1.04% పెరుగుదల.[5] 2018 లో మూడవ త్రైమాసికంలో మిషిగన్ రాష్ట్రపు జిడిపి $538 బిలియన్లు. అమెరికా రాష్ట్రాల్లో ఇది 14 వ స్థానం.[6] మిషిగన్ లో ఆటోమొబైళ్ళు, అహర ఉత్పత్తులు, కంప్యూటరు సాఫ్టువేరు, ఏరోస్పేసు, మిలిటరీ పరికరాలు, ఫర్నిచరు, రాగి, ఇనుప ఖనిజం మొదలైనవి ఉత్పత్తి అవుతాయి. క్రిస్ట్మస్ చెట్లను పెంచడంలో మిషిగన్ మూడవ స్థాన్ంలో ఉంది. 60 వేలకు పైగా ఎకరాల్లో ఈ చెట్లను పెంచుతున్నారు.[7][8] నాలుగు అతిపెద్ద పిజ్జా గొలుసుకట్టు సంస్థల్లో రెండు మిషిగన్లో స్థాపించినవే. 2017 నాటికి మిషిగన్లో 38,59,949 మంది 2,22,553 సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.