సాయిబాబా దేవాలయం, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన మిచిగాన్ రాష్ట్రం, సాగినా పట్టణంలో ఉన్న సాయిబాబా దేవాలయం.[1]
సాయిబాబా దేవాలయం | |
---|---|
![]() సాయిబాబా విగ్రహం | |
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | మిచిగాన్ |
ప్రదేశం: | సాగినా |
ఆలయ వివరాలు | |
ప్రధాన దేవత: | సాయిబాబా |
చరిత్ర
సాయి సమాజ్ ఆఫ్ సాగినా సంస్థకు చెందిన నలుగురు సభ్యులు కలిసి 2022 జనవరిలో సాయిబాబా ధ్యానమందిర నిర్మాణాన్ని ప్రారంభించి, ఎనిమిది నెలల్లో దేవాలయంగా రూపుదిద్దారు. రాజస్థాన్ రాష్ట్రంనుంచి సాయిబాబా విగ్రహాన్ని తెప్పించారు.
ప్రారంభం
2022 ఆగస్టు 18 నుండి 20 వరకు సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో అఖండ దీపారాధన, అంకురార్పణ, పంచగవ్య ప్రాషణ, వాస్తు మంటపారాధనలతోపాటు సాయిబాబా, దత్తాత్రేయ, నవగ్రహ హోమాలు నిర్వహించబడ్డాయి. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రతిరోజూ మధ్యాహ్నం, సాయంత్రం అన్నదానం చేశారు. ‘బ్రహ్మశ్రీ’ భాగవతుల యుగంధర శర్మ (కూచిపూడి) ఆధ్వర్యంలో మూడురోజులపాటు జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో సుమారు 8 వందల మంది పాల్గొన్నారు.[2]
పూజా కార్యక్రమాలు
ఈ దేవాలయంలో ప్రతి గురువారం ప్రవాస భారతీయులంతా కలిసి సాయిబాబా హారతులు, భజనలు నిర్వహిస్తున్నారు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.