మార్గరెట్ మిచెల్
అమెరికా రచయిత్రి మరియు పాత్రికేయురాలు / From Wikipedia, the free encyclopedia
మార్గరెట్ మిచెల్ (నవంబరు 8, 1900 – ఆగస్టు 16, 1949), ప్రముఖ అమెరికన్ రచయిత్రి, ప్రాత్రికేయురాలు. ఆమె పూర్తి పేరు మార్గరెట్ మున్నెర్లియన్ మిచెల్. ఆమె జీవించి ఉన్న సమయంలో కేవలం ఒక్క నవలనే ప్రచురించింది. అమెరికా అంతర్యుద్ధం నేపధ్యంగా ఆమె రాసిన గాన్ విత్ ద విండ్ అనే నవల 1936లో ప్రచురింపబడింది. ఈ నవలకు జాతీయ బుక్ అవార్డు, పులిట్జెర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అవార్డు కూడా లభించింది.[1] ఈ మధ్య కాలంలో అముద్రితమైన ఆమె రచనలు కొన్ని, ఒక నవలికలను ప్రచురించారు. ఆమె యుక్తవయసులో ఉన్నప్పుడు రాసిన లాస్ట్ లయ్సెన్ అనే ఈ నవలిక విడుదలైన సంవత్సరంలో బెస్ట్ సెల్లర్ గా నిలవడం విశేషం. అలాగే ది అట్లాంటా జర్నల్ కు ఆమె రాసిన కొన్ని వ్యాసాలను ఈ మధ్య తిరిగి పుస్తకం రూపంలో ప్రచురించబడింది.