మహానటి (2018 సినిమా)
2018 లో నాగ్ అశ్విన్ చే విడుదల చేసిన సినిమా / From Wikipedia, the free encyclopedia
ఇది 2018లో సినీనటి సావిత్రి జీవితం ఆధారంగా నిర్మించిన సినిమా.
మహానటి | |
---|---|
![]() | |
దర్శకత్వం | నాగ్ అశ్విన్ |
రచన | బుర్రా సాయిమాధవ్ (మాటలు) |
కథ | నాగ్ అశ్విన్ |
నిర్మాత | అశ్వినీ దత్, ప్రియాంకా దత్, స్వప్నా దత్ |
తారాగణం | దుల్కర్ సల్మాన్ కీర్తీ సురేష్ విజయ్ దేవరకొండ సమంత |
ఛాయాగ్రహణం | డానీ సంచెజ్- లోపెజ్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | మే 9, 2018 (2018-05-09) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తెలుగులో మహానటిగా, తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీనటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు - సి. అశ్వినీదత్, స్వప్నా దత్, ప్రియాంకా దత్. ఈ సినిమా వైజయంతి మూవీస్, స్వప్న సినెమా బ్యానర్స్ కింద విడుదలయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. మిక్కి జె మెయెర్ చిత్రానికి సంగీతం అందించారు. సినిమా నిర్మాణం మే 2017 లో మొదలై 9 మే 2018న సినిమా విడుదల అయింది.
66వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమా, జాతీయ ఉత్తమ నటి (కీర్తి సురేష్), జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ (ఇంద్రాక్షి పట్టానాయక్, గౌరంగ్ షా, అర్చన రావు) విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి.