భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు / From Wikipedia, the free encyclopedia
ఉత్తమ తెలుగు సినిమాకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ప్రతియేటా భారత కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన చలనచిత్రోత్సవాల డైరెక్టరుచే ప్రదానం చేయబడుతున్నది. ఈ పురస్కారం క్రింద వెండి కమలం, లక్షరూపాయల నగదు ఇస్తారు. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1954 నుండి భారతీయ సినిమాకు ప్రదానం చేయబడుతున్న ప్రముఖమైన పురస్కారాలు. ఈ పురస్కారాలలో భాగంగా దేశంలోని ఏడు ప్రాంతీయ భాషా చిత్రాలకు కూడా బహుమతి ప్రదానం చేస్తున్నారు. రెండవ సంవత్సరం (1955) నుండి బెంగాలీ, హిందీ, కన్నడ, మళయాల,మరాఠీ, తమిళ, తెలుగు భాషలలో ఉత్తమ చిత్రానికి రాష్ట్రపతి వెండిపతకం, ఉత్తమ ద్వితీయ, తృతీయ చిత్రాలకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేయడం ప్రారంభించారు. 1967లో చివరి రెండు బహుమతులు ఉపసంహరించారు.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | జాతీయస్థాయి | |
విభాగం | భారతీయ సినిమా | |
వ్యవస్థాపిత | 1955 | |
మొదటి బహూకరణ | 1955 | |
క్రితం బహూకరణ | 2014 | |
మొత్తం బహూకరణలు | 68 | |
బహూకరించేవారు | సినిమా ఉత్సవాల డైరెక్టరు | |
నగదు బహుమతి | ₹1,00,000 (US$1,300) | |
వివరణ | ఉత్తమ తెలుగు సినిమా | |
క్రితం పేరులు | ఉత్తమ తెలుగు చిత్రానికి రాష్ట్రపతి వెండిపతకం (1954–1968) | |
మొదటి గ్రహీత(లు) | పెద్దమనుషులు | |
క్రితం గ్రహీత(లు) | చందమామ కథలు |
తెలుగులో మొదటిసారిగా పెద్దమనుషులు చిత్రానికి రాష్ట్రపతి రజతపతకం, తోడుదొంగలు,విప్రనారాయణలకు ద్వితీయ, తృతీయ ఉత్తమచిత్రాలుగా పురస్కారాలు లభించాయి. 1973, 1974, 1987, 1994, 2002, 2007, 2009, 2010, 2011 సంవత్సరాలలో వరుసగా జరిగిన 21వ, 22వ, 35వ, 42వ, 50వ, 55వ, 57వ, 58వ, 59వ ఉత్సవాలలో ఈ పురస్కారానికి ఏ తెలుగు చిత్రమూ అర్హత పొందలేదు.