మలయాళం
ఒక భారతీయ భాష / From Wikipedia, the free encyclopedia
మలయాళం, (മലയാളം) దక్షిణ భారతదేశం లోని కేరళ రాష్ట్రములో అధికార భాష. నాల్గున్నర కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష భారతదేశ 22 అధికార భాషలలో ఒకటి. మలయాళం మాట్లాడే వారిని మలయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు. దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల తర్వాత మలయాళం అత్యధిక మంది ప్రజలు మాట్లాడుతారు. మలయాళం ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. మట్లాడే భాష, రాసే విధానం రెండూ తమిళ భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. మలయాళానికి సొంత లిపి ఉంది.
మరింత సమాచారం మలయాళ (മലയാളം), అధికార స్థాయి ...
మలయాళ (മലയാളം) | |
---|---|
మాట్లాడే ప్రదేశం: | భారతదేశం |
ప్రాంతం: | కేరళ, లక్షద్వీప్, , ఇరుగుపొరుగు రాష్ట్రాలు |
మాట్లాడే వారి సంఖ్య: | 4.57 కోట్లు |
స్థానం: | 44 |
అనువంశిక వర్గీకరణ: | ద్రావిడ దక్షిణ |
అధికార స్థాయి | |
అధికార భాష: | కేరళ , లక్షద్వీప్ (భారతదేశం |
నియంత్రణ: | -- |
భాష కోడ్లు | |
ISO 639-1 | ml |
ISO 639-2 | mal |
SIL | MJS |
చూడండి: భాష – ప్రపంచ భాషలు |
మూసివేయి