ఒడిశా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మల్కనగిరి (Malkangiri) ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి 1992 అక్టోబరు 2 న వేరుచేయబడింది. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన కాందిశీకులకు 1965 నుండి ఈ జిల్లాలో 'దండకారణ్య ప్రాజెక్టు' ద్వారా ఆశ్రయం ఇవ్వబడింది. తర్వాత కాలంలో శ్రీలంక తమిళ కాందిశీకులకు కూడా ఆశ్రయం ఇచ్చారు.
మల్కనగిరి | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిషా |
ముఖ్యపట్టణం | మల్కనగిరి |
Government | |
• కలక్టరు | ఎం.ముత్తుకుమార్, IAS |
• లోక్ సభ సభ్యుడు | ప్రదీప్ కుమార్ మఝి, భారత జాతీయ కాంగ్రెసు |
విస్తీర్ణం | |
• Total | 5,791 కి.మీ2 (2,236 చ. మై) |
Elevation | 195 మీ (640 అ.) |
జనాభా (2001) | |
• Total | 4,80,232 |
• జనసాంద్రత | 83/కి.మీ2 (210/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 764 xxx |
Vehicle registration | OD-10 |
లింగ నిష్పత్తి | 1.004 ♂/♀ |
అక్షరాస్యత | 31.26% |
లోక్ సభ నియోజకవర్గం | Nabarangpur |
Vidhan Sabha constituency | 2, Malkangiri, Chitrakonda |
శీతోష్ణస్థితి | Aw (Köppen) |
అవపాతం | 1,700 మిల్లీమీటర్లు (67 అం.) |
సగటు వేసవి ఉష్ణోగ్రత | 47 °C (117 °F) |
సగటు శీతాకాల ఉష్ణోగ్రత | 13 °C (55 °F) |
మల్కనగిరి తూర్పు కనుమలలో18.35°N 81.90°E[1] వద్ద ఉంది. ఈ ప్రాంతపు సగటు ఎత్తు 170 మీ (557.7 అడుగులు).
జిల్లాలోని బలిమెలా వద్ద పవర్ స్టేషను ఉంది. విజయవాడ - రాంచి రహదారి ఈ మార్గం గుండా పయనిస్తుంది.
2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మల్కనగిరి జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 612,727,[3] |
ఇది దాదాపు. | సొలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | వర్మొంట్ నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 523 వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 106 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.53%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1016:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 49.49%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అల్పం |
మల్కనగిరి ఒడిషా రాష్ట్రం దూరప్రాంతాలలో ఒకటి. మల్కనగిరి జైపోర్ - మోటు రహదారి, గోవిందపల్లి రహదారి ద్వారా రాష్ట్రంతో అనుసంధానితమై ఉంది.
The following is the 2 Vidhan sabha constituencies[6][7] of Malkangiri district and the elected members[8] of that area
భారతదేశపు 2001 జనాభా లెక్కల ప్రకారం,[9] మల్కనగిరి జనాభా 23,110. వీరిలో పురుషులు 52%, మహిళలు 48%. ఇక్కడి సగటు అక్షరాస్యత రేటు 57%, జాతీయ సగటు కన్నా తక్కువ. మల్కనగిరి జనాభాలో, 15% మంది చిన్న పిల్లలు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.