మలాలా యూసఫ్‌జాయ్
పాకిస్తానీ సామాజిక కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత / From Wikipedia, the free encyclopedia
అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్ [Malala Yousafzai]
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మలాలా యూసఫ్‌జాయ్ | |
---|---|
ملاله یوسفزۍ | |
![]() | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1997-07-12) 1997 జూలై 12 (వయసు 27) మింగోరా, North-West Frontier Province, పాకిస్తాన్ |
పౌరసత్వం | పాకిస్తాన్ |
రాజకీయ పార్టీ | ఏదీకాదు |
వృత్తి | Pupil, blogger, activist |
జాతి / తెగ | పష్తూన్ |
బంధువులు | జియాఉద్దీన్ యూసఫ్ (తండ్రి) |
Known for | మహిళా హక్కులు activism, educationism, taliban assassination attempt |
సంస్థలు | మలాలా ఎడ్యుకేషన్ ఫండ్ |
పురస్కారములు | నేషనల్ యూత్ పీస్ ప్రైజ్ (2011) సిమోన్ డి బ్యూరోర్ ప్రైజ్ (2013) |
చరిత్ర సృష్టించారు. భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు మహిళా విద్యకు తన మద్దతును ప్రకటించడమే కాకుండా, పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తిన మలాలా యూసుఫ్ జాయ్ (Malala Yousafzai) ను హత్య చేస్తామని తెహ్రీక్ ఈ తాలిబన్ తీవ్రవాద సంస్థ తాజాగా ప్రకటించింది. ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. ఆమెకు విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. బుధవారం పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రి డాక్టర్లు ఏడు గంటల పాటు శ్రమించి ఆమె వెన్నెముకలో ఉన్న బుల్లెట్‌ను తొలగించారు.
ఈ విషయం తెలుసుకున్న తాలిబన్ తీవ్రవాదులు.. ఆమెను హతం చేసి తీరుతామని ప్రకటించారు. డాక్టర్లు ఆమెను రక్షించినప్పటికీ తమ చేతుల్లో చావు తప్పదని హెచ్చరించారు. ఈ యువతి సాహసంపై పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ మాట్లాడుతూ మలాలా ఒక వ్యక్తికాదని ఓ శక్తి అని చెప్పుకొచ్చారు. ఆమె ధైర్యం, తెగింపును ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలన్నారు. ఉగ్రవాదంపై పోరాడి గెలుపు సాధిస్తామని చెప్పారు. ఈ దాడి పాకిస్థాన్‌కు మేల్కొలుపు కావాలన్నారు.
పాకిస్థాన్ అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్ జీవిత చరిత్ర "ఐయామ్ మలాలా" పేరిట పుస్తక రూపంలో రానుంది. తాలిబన్ల దాడిలో గాయపడి ఇటీవలే పాఠశాలలో చేరిన పాక్ అమ్మాయి, మలాలా యూసఫ్ జాయ్ తన జ్ఞాపకాలను పుస్తక రూపంలోకి తీసుకురానుంది.
తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను 'ఐయామ్ మలాలా' (నేను మలాలా) అన్న పేరుతో ఆమె పుస్తకం రాసింది.
బర్మింగ్‌హామ్‌లో ఇస్లాం సంప్రదాయంలో అసర్ మలిక్‌తో మలాలా యూసఫ్జాయి పెళ్లి చేసుకున్నాని ట్విట్టర్ వేదికగా 2021 నవంబరు 9న వెల్లడించారు.[1]