మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అనేది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానికంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రం, దాని 55 జిల్లాలపై పరిపాలనసాగించే అత్యున్నత పాలక అధికార సంస్థ. ఇది మధ్యప్రదేశ్ గవర్నరు నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసన శాఖను కలిగి ఉంటుంది. 2000లో ఈ రాష్ట్రం నుండి దక్షిణ భాగం, దాని స్వంత ప్రభుత్వంతో కొత్త రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ను ఏర్పాటు చేయడానికి విభజించబడింది.

త్వరిత వాస్తవాలు Seat of Government, దేశం ...
Government of Madhya Pradesh
Thumb
Seat of GovernmentBhopal
దేశంIndia
చట్ట వ్యవస్థ
AssemblyMadhya Pradesh Legislative Assembly
SpeakerNarendra Singh Tomar (BJP)
Members in Assembly231 (230 elected + 1 nominated)
కార్యనిర్వహణ వ్యవస్థ
GovernorMangubhai C. Patel
Chief MinisterMohan Yadav (BJP)
Chief SecretaryVeera Rana, IAS
Judiciary
High CourtMadhya Pradesh High Court
Chief JusticeJustice Sheel Nagu (acting)
మూసివేయి

కార్యనిర్వాహకవర్గం

భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతిచే నియమించబడిన గవర్నరు మధ్య ప్రదేశ్ రాష్ట్రాధినేతగా ఉన్నాడు. గవర్నరు పదవి చాలా వరకు లాంఛనప్రాయమైనది. ముఖ్యమంత్రికి ప్రభుత్వ అధిపతిగా కార్యనిర్వాహక అధికారాలు, ఆర్థిక అధికారాలు చాలా వరకు కలిగి ఉన్నాయి. భోపాల్ మధ్య ప్రదేశ్ రాజధాని, మధ్య ప్రదేశ్ విధానసభ (శాసనసభ) సెక్రటేరియట్ భోపాల్‌లో ఉన్నాయి.

శాసనవ్యవస్థ

ప్రస్తుత మధ్య ప్రదేశ్ శాసనసభ ఏకసభ్య శాసనసభ. మధ్య ప్రదేశ్ విధానసభలో 230 మంది శాసనసభ సభ్యులు (ఎం.ఎల్.ఎ.) ఒకే స్థాన నియోజకవర్గాల నుండి ఓటర్లుచే నేరుగా ఎన్నికయ్యారు. ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు.ఏదేని పరిస్థితులలో శాసనసభను మధ్యలో గవర్నరు రద్దు చేయకపోతే దాని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. [1]

2016 ఫిబ్రవరి 1 న మధ్య ప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఆంగ్లాన్ని ఉపయోగించడాన్ని నిషేధించింది. అన్ని అధికారిక ప్రయోజనాల కోసం సమర్థవంతంగా హిందీని ఉపయోగించబడుతుంది. ఆంగ్లం తెలియని ఉద్యోగులను వేధించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.[2] 2017 డిసెంబరు 4న , మధ్య ప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా 12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించే బిల్లును ఆమోదించింది.

న్యాయపరమైన

జబల్‌పూర్‌లో ఉన్న మధ్య ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం రాష్ట్రం మొత్తంపై అధికార పరిధిని కలిగి ఉంది. [3] ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు. [4]

ప్రభుత్వ సంస్థలు

  • ప్రజా సంబంధాల శాఖ

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.