భిన్నేక తుంగ్గల్ ఇకా
ఇండోనేషియా అధికారిక జాతీయ నినాదం / From Wikipedia, the free encyclopedia
భిన్నేక తుంగల్ ఇకా(భిన్నత్వంలో ఏకత్వం) ఇండోనేషియా యొక్క అధికారక జాతీయ నినాదం. ఇది పాత జావా భాషకు సంబంధిచిన వాక్యం. దీని అర్థం భిన్నత్వంలో ఏకత్వం.[1] ఇది ఇండోనేషియా జాతీయ చిహ్నమైన గరుడ పంచశీల పై రాసి ఉంటుంది. ఇది ఇండోనేషియా రాజ్యాంగపు 36ఎ(36A) అధికరణలో ప్రత్యేకంగా గుర్తించబడింది. గరుడ అనే పేరు విష్ణుమూర్తి యొక్క వాహనము, భౌద్ధ మత బంగారు పక్షి రాజం అయిన గరుడ(గరుత్మంతుడు) నుండి తీసుకోబడింది.
ఇది పాత జావా భాషలో రాసిన సుతసోమ కావ్యం(జావా: సుతసోమ కకావిన్) నుండి తీసుకోబడిన ఒక వాక్యం. ఇది ఎంపు తంత్యులర్(ఎంపు ఒక గౌరవ వాచకం[2]) చే రచించబడింది. ఇది 14వ శతాబ్ధపు మజాపహిత్ రాజ్యంలో, రాజసానగార హయాం లో రచించబడింది. ఈ కావ్యం ఇతిహాస పద్యాలు ఛందస్సు లో ఉంటాయి.
హిందువుల (ముఖ్యంగా శైవులు), బౌద్ధుల మధ్య సహనాన్ని ప్రభోదించడం చేత ఇది ముఖ్యమైన కావ్యంగా భావించబడుతుంది.[3]