![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/88/Bharatpur-10-Laxmi_Vilas_Palace-2018-gje.jpg/640px-Bharatpur-10-Laxmi_Vilas_Palace-2018-gje.jpg&w=640&q=50)
భరత్పూర్ (రాజస్థాన్)
రాజస్థాన్ రాష్ట్రం లోని ఒక నగరం / From Wikipedia, the free encyclopedia
భరత్పూర్, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం. భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీకి దక్షిణాన 180 కి.మీ. (110 మైళ్లు), రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి 178 కి.మీ. (111 మైళ్లు), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు పశ్చిమాన 55 కి.మీ (34మైళ్లు), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నుండి 38 కి.మీ. (24 మైళ్లు) దూరంలో ఉంది.ఇది భరత్పూర్ జిల్లాకు, విభాగానికి పరిపాలనా ప్రధాన కేంద్రం.భరత్పూర్ భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్సిఆర్) లో ఒక భాగం.[2] పూర్వపు ఈ నగరం భరత్పూర్ రాజ్యానికి రాజధాని.2014 లో 65 వార్డులతో నగరపాలక సంస్థగా మారింది.[3][4][5]
త్వరిత వాస్తవాలు భరత్పూర్ లోహాగర్, దేశం ...
భరత్పూర్
లోహాగర్ | |
---|---|
![]() లక్ష్మీ ప్యాలెస్ | |
Nickname: లోహాగర్ | |
Coordinates: 27.22°N 77.48°E / 27.22; 77.48 | |
దేశం | ![]() |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | భరత్పూర్ |
Founded by | భరత్ |
Named for | భరత్- ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక చారిత్రక యోధుడు |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | భరత్పూర్ నగరపాలక సంస్థ |
Elevation | 183 మీ (600 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 2,52,838 |
భాషలు | |
• అధికార | హిందీ , ఆంగ్లం |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్కోడ్ | 321001 |
ప్రాంతపు కోడ్ | (+91) 5644 |
ISO 3166 code | RJ-IN |
Vehicle registration | RJ-05 |
మూసివేయి
ఇది సముద్రమట్టానికి 183 మీ (600 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. దీనిని "తూర్పు గేట్వే టు రాజస్థాన్" అని కూడా పిలుస్తారు. భరత్పూర్కోటను "లోహాగఢ్" అని పిలుస్తారు.[6]