From Wikipedia, the free encyclopedia
బెరిలీయం అయోడైడ్ ఒక రసాయన సంయోగపదార్థం. ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.బెరీలియంమరియు అయోడిన్ మూలక పరమాణు సంయోగం వలన ఏర్పడినది. ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం BeI2. తేమను పీల్చుకునే/చెమ్మగిల్లే/ఆర్ద్రతాకర్షక (hygroscopic ) గుణమున్న సంయోగ పదార్థం. బెరిలీయం అయోడైడ్ నీటిలో తీవ్రంగా చర్య జరపడంవలన హైడ్రో అయోడిక్ ఆమ్లాన్ని ఏర్పరచును.
పేర్లు | |
---|---|
Systematic IUPAC name
Beryllium iodide | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7787-53-3] |
పబ్ కెమ్ | 82231 |
SMILES | [Be+2].[I-].[I-] |
| |
ధర్మములు | |
BeI2 | |
మోలార్ ద్రవ్యరాశి | 262.821 g/mol |
స్వరూపం | colorless needle-like crystals |
సాంద్రత | 4.325 g/cm³ |
ద్రవీభవన స్థానం | 480 °C (896 °F; 753 K) |
బాష్పీభవన స్థానం | 590 °C (1,094 °F; 863 K) [1] |
నీటిలో ద్రావణీయత |
reacts explosively |
ద్రావణీయత | Slightly soluble in CS2 Soluble in ethanol, diethyl ether[2] |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
orthorhombic |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-192.62 kJ/mol |
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
19 kJ/mol |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
130 J/mol K |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 71.14 J/(mol × K) |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | see Berylliosis |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible) |
TWA 0.002 mg/m3 C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be) |
REL (Recommended) |
Ca C 0.0005 mg/m3 (as Be) |
IDLH (Immediate danger) |
Ca [4 mg/m3 (as Be)] |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
magnesium iodide calcium iodide strontium iodide barium iodide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బెరిలీయం అయోడైడ్ భౌతికంగా రంగులేని, సూదుల వంటి పొడవైన స్పటిక రూపంలో ఉండును.బెరిలీయం అయోడైడ్ అణుభారం 262.821గ్రాములు/మోల్.సాధారణ ఉష్ణోగ్రత వద్ద సాంద్రత 4.325 గ్రాములు/సెం.మీ3. బెరిలీయం అయోడైడ్ ద్రవీభవన స్థానం 480 °C (896 °F; 753K, బాష్పీభవన స్థానం 590 °C (1,094 °F; 863K). నీటితో తీవ్రంగా చర్య జరుపును. బెరిలీయం అయోడైడ్ ఈథర్, డైఇథైల్ ఈథర్‌లో కరుగుతుంది.కార్బన్ సల్ఫేట్ లో స్వల్పంగా కరుగుతుంది.ఆర్తోరోంబిక్ స్పటికరూప నిర్మాణంకలిగి ఉంది.
500 °C -700 °C ఉష్ణోగ్రత వద్ద బెరీలియం లోహాన్ని అయోడిన్ మూలకంతో రసాయన చర్య జరపడం వలన బెరిలీయం అయోడైడ్ ఉత్పత్తి అగును.
బెరీలియంకార్బైడ్ తో హైడ్రోజన్ అయోడైడ్ తో వాయుస్థితిలో చర్య వలన బెరిలీయం అయోడైడ్ ఉత్పత్తిఅగును.
బెరిలీయం అయోడైడ్ అణువు లోని అయోడిన్ ను సులభంగా తొలగించి, దాని స్థానంలో ఏదైన హలోజన్ను ప్రవేశపెట్టవచ్చును.ఫ్లోరిన్ తో బెరిలీయం ఫ్లోరైడ్, అయోడిన్ ఫ్లోరైడులను ఏర్పరచవచ్చును.అలాగే క్లోరిన్‌తో బెరిలీయం క్లోరైడ్, బ్రోమిన్‌తో బెరీలియం బ్రోమైడ్లు ఏర్పడును.క్లోరేట్, పర్మాంగానేట్ వంటి అక్స్సికరణ కారకాలతో బెరిలీయం అయోడైడ్ తీవ్రంగా చర్య జరిపి బచ్చలి పండు రంగుకలిగిన వాయురూప అయోడిన్ ను విడుదల చేయును.బెరిలీయం అయోడైడ్ ఘన స్థితిలో, వాయుస్థితిలో గాలిలో మండుస్వభావం కలిగిఉన్నది.
బెరిలీయం అయోడైడ్ ను వేడిగా ఉన్న టంగ్స్టన్ లోహ ఫిలమెంట్ మీదుగా పంపడం ద్వారా అధికశుద్ధమైన బెరిలీయాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.