బి.డి.జెట్టి గా పిలవబడే బసప్ప దానప్ప జెట్టి తాత్కాలిక భారత రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు.1974, ఆగస్టు 24 నుండి రాష్ట్రపతిగా పనిచేయుచున్న ఫకృద్దీన్ అలీ అహ్మద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప జెట్టి కొంత కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసాడు.ఇతని తండ్రి దానప్పజెట్టి, తల్లి సంగమ్మ.వీరిది కన్నడ లింగాయత్ కుటుంబం.తండ్రి కిరాణా వ్యాపారి. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జెట్టి కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, జంఖండి, తాలుకా సవాల్గి గ్రామంలో 1912, సెప్టెంబరు 10 న జన్మించాడు. మృదువుగా మాట్లాడే జెట్టి పురపాలక సంఘం సభ్యుడిగా రాజకీయ జీవితంతో ప్రారంభమై, ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో భారతదేశపు రెండవ అత్యున్నత కార్యాలయానికి ఎదిగాడు.ఉపరాష్ట్రపతిగా 1974 నుండి 1979 వరకు కొనసాగాడు.

త్వరిత వాస్తవాలు బి.డి. జెట్టి, జననం ...
బి.డి. జెట్టి
Thumb
బి.డి. జెట్టి
జననం
బసప్ప దానప్ప జెట్టి

1912, సెప్టెంబరి 10
జంఖండి, సవాల్గి
మరణం2002, జూన్ 2
ఇతర పేర్లుబసప్ప దానప్ప జెట్టి
విద్యబి.ఏ.ఎల్.ఎల్.బి
వృత్తిన్యాయవాది
క్రియాశీల సంవత్సరాలుఉపరాష్ట్రపతిగా 1974 - 1979
ఉద్యోగంభారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాజకీయ నాయకుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు
తల్లిదండ్రులు
  • దానప్పజెట్టి (తండ్రి)
  • సంగమ్మ (తల్లి)
వెబ్‌సైటుhttp://vicepresidentofindia.nic.in/jati.asp
మూసివేయి

ప్రారంభ జీవితం

జెట్టి కుటుంబ ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని విద్యను పూర్తి చేశాడు.బసప్పజెట్టి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.బొంబాయి విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న కొల్హాపూర్‌లోని  రాజారామ్ లా కాలేజీ నుండి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. తరువాత అతను తన స్వస్థలమైన జంఖండిలో న్యాయవాది వృత్తి ప్రారంభించి చాలా తక్కువ కాలం పాటు మాత్రమే న్యాయ ప్రాక్టీసును ప్రారంభించాడు.

రాజకీయ జీవితం

1940 లో జెట్టి జంఖండిలో మునిసిపాలిటీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు.తరువాత 1945 లో జంఖండి పురపాలక సంఘం అధ్యక్షుడయ్యాడు. తరువాత  జంఖండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికై కర్ణాటక రాచరికపు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా నియమించబడ్డాడు.1948 లో అతను జంఖండి రాష్ట్రానికి 'దివాన్' (ముఖ్యమంత్రి) అయ్యాడు. దివాన్ గా మహారాజ్ శంకర్ రావు పట్వర్ధన్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు.చిన్న రాజ్యానికి ముఖ్యమంత్రిగా భారత యూనియన్‌లోకి ప్రవేశించాడు. జంఖండిని బొంబాయి రాష్ట్రంలో విలీనం చేసిన తరువాత 1948 మార్చి 8 న జెట్టి చట్టబద్దమైన తన న్యాయవాదవృత్తి తిరిగి కొనసాగించటానికి వచ్చి 20 నెలలు అతని వృత్తిని కొనసాగించాడు.[1][2] ఆ తరువాత జెట్టి విలీన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడానికి బొంబాయి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా నామినేట్ అయ్యాడు.అతని నామినేషన్ అయిన వారంలోనే అప్పటి బాంబే ముఖ్యమంత్రి బి.జి. ఖేర్‌కు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించబడ్డాడు.ఆ సామర్థ్యంలో కొన్ని సంవత్సరాలు పనిచేశాడు.1952 సార్వత్రిక ఎన్నికల తరువాత అప్పటి బాంబే ప్రభుత్వ ఆరోగ్య, కార్మిక మంత్రిగా నియమించబడ్డాడు.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వరకు ఆ పదవిలో కొనసాగాడు.

మైసూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత జెట్టి కర్ణాటక శాసనసభలో సభ్యుడయ్యాడు.1961 మైసూరు భూ సంస్కరణల చట్టానికి మార్గం సుగమం చేసే భూ సంస్కరణల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించాడు. ఈ బిల్లును ఆమోదించినప్పుడు జెట్టి ముఖ్యమంత్రిగా, కడిదాల్ మంజప్ప రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. 1958 లో ఎస్.నిజలింగప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీ తరుపున అతను 1958 లో మైసూర్ ముఖ్యమంత్రి అయ్యాడు. 1962 వరకు ఆపదవిలో కొనసాగాడు[1] మూడవ సార్వత్రిక ఎన్నికలలో జంఖండి నియోజకవర్గం నుండి తిరిగి ఎన్నికైన జట్టిని 1962 జూలై 2 న ఎస్.నిజలింగప్ప మంత్రిత్వ శాఖలో ఆర్థిక మంత్రిగా నియమించారు. అదే నియోజకవర్గం నుండి నాల్గవ అసెంబ్లీకి తిరిగి ఎన్నికయి, ఆహార పౌర సరఫరాల శాఖకు మంత్రిగా నియమితులయ్యారు.

తరువాత రాజకీయ జీవితం

జెట్టి ప్రతిభ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.1968 లో పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యాడు.1972 లో ఒడిశా గవర్నర్‌గా, 1974 లో భారత ఐదవ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాడు. అతను 1977 లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం తరువాత కొంతకాలం తాత్కాలిక ప్రెసిడెంట్ పదవిలో కొనసాగాడు.[3] అయితే జెట్టి అధ్యక్ష పదవి వివాదం లేకుండా లేదు.1977 ఏప్రియల్ లో కేంద్ర హోంమంత్రి చరణ్ సింగ్ తొమ్మిది రాష్ట్రాల శాశన సభలను రద్దు చేయడానికి చర్చనీయాంశమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, జెట్టి ఈ ఉత్తర్వుపై సంతకం చేయడానికి నిరాకరించాడు. రాష్ట్రపతి కేబినెట్ సలహాను అంగీకరించే సంప్రదాయాన్ని ఉల్లంఘించారని కొందరు అభిప్రాయపడ్డారు. తరువాత అతను ఈ ఉత్తర్వుపై సంతకం చేసినప్పటికీ, కేంద్రం యొక్క చర్య రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా సరైంది కాదని కూడా జెట్టి అభిప్రాయపడ్డాడు.1979 లో ఉపరాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన తరువాత, దేశంలోని రాజకీయ పరిస్థితులను బాగా గమనించే వ్యక్తిగా జెట్టి వెలుగులోకి వచ్చాడు.[1]

ప్రపంచ తెలుగు మహసభల ముఖ్య అథిధి

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్టంలో హైదరాబాదులో 1975 ఏప్రియల్ 12 నుండి జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు బి.డి జెట్టి ముఖ్యఅతిధిగా అప్పటి ఉపరాష్ట్రపతి హోదాలో హాజరయ్యాడు.ఆనాటి సభలలో తెలుగు ప్రసంగాన్ని కన్నడభాషలో రాసుకుని ప్రసంగించాడు.[4]

జెట్టి నిర్వహించిన పదవులు

  • 1945-48: పూర్వపు రాచరిక రాష్ట్రమైన జామ్‌ఖండిలో విద్యాశాఖ మంత్రి
  • 1948 -51 జంఖండి రాష్టానికి ముఖ్యమంత్రి
  • 1948-52: పార్లమెంటరీ కార్యదర్శి బి.జి. పూర్వపు బొంబాయి రాష్ట్రంలో ఖేర్ ప్రభుత్వం
  • 1953-56: బొంబాయిలోని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆరోగ్య, కార్మిక శాఖ సహాయ మంత్రి
  • 1958-62: మైసూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి
  • 1962-68: క్యాబినెట్ మంత్రి, మైసూర్ ప్రభుత్వం
  • 1968-72: కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నరు
  • 1972-74: ఒడిషా గవర్నర్
  • 1974-79: భారత ఉపాధ్యక్షుడు
  • 1977-00 లో ఫిబ్రవరి 11 నుండి జూలై 25 వరకు 164 రోజులు యాక్టింగ్ ప్రెసిడెంట్.[5]

మరణం

2002 జూన్ 2 నలో చనిపోయాడు.[6]

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.