బాదంపాలు
From Wikipedia, the free encyclopedia
బాదం పాలు అనునది బాదం పప్పు నుండి తయారు చేయ బడిన పానీయం. ఇది పాలకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. జంతువుల పాల వలె బాదం పాలు క్రొవ్వులు, పాల చక్కెర లను కలిగి ఉండవు. ఇది జంతువుల యొక్క ఉత్పత్తులను కలిగియుండనందువల్ల శాఖాహారులకు, పాల ఉత్పత్తులను వాడని వారికి ఉపయోగకరమైనది. వాణిజ్యపరంగా బాదంపాల ఉత్పత్తులు సాధారణ, వెనీలా, చాక్లెట్ రుచులను కలిగి ఉంటాయి.కొన్ని సందర్భాలలో విటమినులు తో కూడి ఉంటాయి. ఆవు పాలు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది. బలవర్ధకం కూడా. గృహాలలో బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలిపి తయారు చేస్తారు.మామూలుగా ఇది తెలుపు రంగులో ఉంటుంది. రుచి కొరకు ఆకర్షణ కొరకు ఇతర పదార్ధములను కలుపుట వలన రంగు మారుతుంది. వెనీలా, చక్కెరలను రుచి కోసం కలుపుతారు.[1]
జ్యూస్ అనగానే గుర్తుకు వచ్చేది బాదంపాలు. ఎందుకంటే వేసవి కాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా బాదం పాలు అమ్ముడు పోతుంది. ఫ్రూట్ జ్యూస్ లో బాదంపాలు కలుపుకొని తాగుతారు.