ఒడిశా లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
బర్గఢ్ ఒడిశా రాష్ట్రం, బర్గఢ్ జిల్లాలో పట్టణం. ఇది బర్గఢ్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. బర్గఢ్ 'వరి' సాగుకు ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లాను ఒడిశా రాష్ట్ర "భటా హండి" అని పిలుస్తారు.
బర్గఢ్ | |
---|---|
పట్టణం | |
Nickname: BGH | |
Coordinates: 21°20′N 83°37′E | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | బర్గఢ్ |
విస్తీర్ణం | |
• Total | 20.80 కి.మీ2 (8.03 చ. మై) |
• Rank | 13 (ఒడిశాలో) |
Elevation | 171 మీ (561 అ.) |
జనాభా (2011)[1] | 80,625 |
• జనసాంద్రత | 38,762/కి.మీ2 (1,00,390/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
• మాట్లాడేవి | సంబల్పురి |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 768028 |
Vehicle registration | OD-17 |
Website | http://bargarh.nic.in |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] బర్గఢ్ జనాభా 83,651. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. బర్గఢ్ సగటు అక్షరాస్యత 76%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; 57% పురుషులు, 43% స్త్రీలు అక్షరాస్యులు. జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.
బర్గఢ్ నుండి నాలుగు రాష్ట్రాల రాజధానులకు - రాయ్పూర్ (222 కి.మీ.), భువనేశ్వర్ (350 కి.మీ.), రాంచీ (600 కి.మీ. ), కోల్కతా (600 కి.మీ.) లకు - చక్కటి రైలు రోడ్డు మార్గాలున్నాయి. ఈ పట్టణం సంబల్పూర్, రాయ్పూర్ నగరాల మధ్య జాతీయ రహదారి 6 (భారతదేశం) (పాత నంబరింగ్) పై ఉంది. బర్గఢ్ రోడ్ రైల్వే స్టేషన్ సంబల్పూర్-జార్సుగూడ-విజయనగరం మార్గంలో ఉంది. ఇది నేరుగా భువనేశ్వర్, సంబల్పూర్, రాయ్పూర్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, కొచ్చి, రాంచీ, అసన్సోల్, కోల్ కతా, వారణాసి, అహ్మదాబాద్, సూరత్, ముంబై లకు రైలు సౌకర్యం కల్పిస్తుంది. జాతీయ రహదారి 26 ఇక్కడే ఉద్భవించింది. ఇది దక్షిణ ఒడిశా లోని దాదాపు అన్ని జిల్లాలతో కలుపుతుంది.
సమీప విమానాశ్రయాలు: రాయ్పూర్ (220 కి.మీ.), భువనేశ్వర్ (350 కి.మీ.), ఝార్సుగూడా (110 కి.మీ.).
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.