ఫ్లోరిడా
From Wikipedia, the free encyclopedia
ఫ్లోరిడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒక రాష్ట్రము. ఫ్లోరిడా అమెరికా రాష్ట్రాలలో ఆగ్నేయంగా ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రపు పడమర దిశలో మెక్సికో ఖాతం, ఉత్తరంలో అలబామా రాష్ట్రం, జార్జియా రాష్ట్రం, తూర్పున అట్లాంటిక్ మహా సముద్రం ఉన్నాయి. అమెరికా సంయుక్తరాష్ట్రాలలో ఫ్లోరిడా వైశాల్యంలో 22వ స్థానంలోనూ, జనసంఖ్యలో 4వ స్థానం లోనూ అలాగే జనసాంధ్రతలో 8వ స్థానంలోనూ ఉంది.
ఫ్లోరిడా | |
---|---|
దేశం | సంయుక్త రాష్ట్రాలు |
రాష్ట్రం ఏర్పడుటకు ముందు | ఫ్లోరిడా భూభాగం |
యూనియన్ లో ప్రవేశించిన తేదీ | మార్చి 3, 1845 (27 వ) |
అతిపెద్ద నగరం | జాక్సన్విల్లే |
అతిపెద్ద మెట్రో | మయామి |
Government | |
• గవర్నర్ | రిక్ స్కాట్ (R) |
• లెప్టినెంట్ గవర్నర్ | జేన్నిఫెర్ కార్రోల్ (R) |
Legislature | ఫ్లోరిడా శాసనసభ |
• ఎగువ సభ | సెనేట్ |
• దిగువ సభ | ప్రతినిధుల సభ |
U.S. senators | బిల్ నెల్సన్ (D) మార్కో రూబియో (R) |
U.S. House delegation | 19 రిపబ్లికన్లు, 6 డెమోక్రాట్లు (list) |
Population | |
• Total | 1,90,57,542 (2,011 est)[1] |
• Density | 353.4/sq mi (136.4/km2) |
భాష | |
• అధికార భాష | ఇంగ్లీష్ |
• మాట్లాడే భాష | ఇంగ్లీష్ 74.54% స్పానిష్ 18.65% |
Trad. abbreviation | Fla. |
అక్షాంశం | 24° 27′ N to 31° 00' N |
రేఖాంశం | 80° 02′ W to 87° 38′ W |
The Flag of ఫ్లోరిడా. | |
Animate insignia | |
ఉభయ చరాలు | Barking tree frog |
పక్షి/పక్షులు | ఉత్తర మొకింగ్ |
సీతాకోకచిలుక | Zebra Longwing |
చేప | ఫ్లోరిడా లర్జ్మౌత్ బస్ |
పూవు/పూలు | ఆరెంజ్ మొగ్గ |
క్షీరదాలు | Florida panther, Manatee, Bottle-nosed dolphin, Florida Cracker Horse |
సరీసృపం | American Alligator, Loggerhead turtle |
వృక్షం | Sabal Palmetto |
Inanimate insignia | |
పానీయం | Orange juice |
ఆహారం | Key lime pie, Orange |
రత్నం | Moonstone |
శిల | agatized Coral |
ముత్యపుచిప్ప | Horse conch |
మట్టి | Myakka |
పాట(లు) | "హోం పాత ఫోల్క్స్" |
Route marker(s) | |
State Quarter | |
Released in 2004 | |
Lists of United States state insignia |
అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో ఖాతం మధ్య ఉన్న ద్వీపకల్పంలోనే ఫ్లోరిడా రాష్ట్రంలోని అధిక భాగం ఉటుంది. ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యం 1,350 చదరపు మైళ్ళు. అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో ఖాతం మధ్య ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. రాష్ట్రంలో అధిక భాగం సముద్రమట్టానికి సమానంగా ఉంటుంది. ఈ రాష్ట్రపు నేలను అవక్షేపిత నేలగా వర్గీకరించారు. రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు విభిన్నంగా ఉంటాయి. ఉత్తర భూభాగంలో ఉపఉష్ణమండల ఉష్ణోగ్రత దక్షిణ భూభాగంలోఉష్ణమండల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ రాష్ట్ర జంతు చిహ్నం అమెరికన్ అలిగేటర్ అనబడే పెద్ద మొసలి, ఫ్లోరిడా చిరుత, మనటీ అనే సముద్ర జీవి. వీటిని ప్రపంచప్రసిద్ధమైన ఎవర్జిలేడ్స్ జాతీయ ఉద్యానవనంలో చూడవచ్చు.
1513 లో మొదటి యురేపియన్ ఒప్పందం పూర్తికాగానే స్పానిష్ సాహస యాత్రికుడు జువాన్ ఫోన్స్ డే లియోన్ ఈ నగరానికి లా ఫ్లోరిడా (పూల భూమి)అని నామకరణం చేసాడు. ఆయన ఇక్కడకు ఈస్టర్ సమయంలో ప్రవేశించాడు. 1845లో రాష్ట్రహోదా లభించే వరకు ఫ్లోరిడా యురేపియన్ శక్తులకు ఒక సవాలుగానే ఉండిపోయింది. అమెరికన్ అంతర్య్ద్ధం తరువాత ఇండియంస్, ఇతర స్థానిక జాతుల మధ్య విభేదాలు కలిగించి విడదీయడానికి ఫ్లోరిడా ప్రధాన వేదిక అయ్యింది. ప్రస్తుతం ఫ్లోరిడా అత్యధిక హిస్పానిక్ జాతి ప్రజలు నివసిస్తున్న రాష్ట్రంగా, అత్యధికంగా జనసంఖ్య అభివృద్ధి చెందడం, అలాగే ఫ్లోరిడా పర్యావరణ ఆందోళనలకు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఫ్లోరిడా ఆదాయం పర్యాటకం, వ్యవసాయం, రవాణాలతో (19వ శతాబధం నుండి అభివృద్ధి చేయబడింది)ప్రభావితమై ఉంటుంది. ఫ్లోరిడా అమ్యూజ్మెంట్ పార్కులకు, ఆరంజ్ ఉత్పత్తికి, కెన్నడీ స్పేస్ కేంద్రానికి కూడా ప్రత్యేక గుర్తింపును పొంది ఉంది.
ఫ్లోరిడా సంస్కృతి పలు సంప్రదాయాల కలయికకు అద్దం పడుతుంది. స్థానిక అమెరికన్లు, యురేపియన్ అమెరికన్లు, హిస్పానిక్, ఆఫ్రికన్ అమెరికన్లు భవన నిర్మాణాలలోనూ ఆహారరంగంలోనూ కనిపిస్తుంటారు. మార్జోరీ కిన్నన్ రాలింగ్స్, ఎర్నెస్ట్ హెమింగ్వే, టెన్నెస్సీ విలియమ్స్ వంటి రచయితలను ఎక్కువగా ఆకర్షించింది. ఈ ఆకర్షణ ఇంకా అలా ప్రజాదరణ పొందిన వారిని, క్రీడా కారుల వరకూ కొనసాగుతూ ఉంది. ఫ్లోరిడా టెన్నిస్, గోల్ఫ్, ఆటో పందాలు, జల సంబంధ క్రీడలకు అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉంది.