From Wikipedia, the free encyclopedia
ప్రేమ్ చంద్ బైర్వా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డూడు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరు 12న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
ప్రేమ్ చంద్ బైర్వా 1969 ఆగస్టు 31న జన్మించాడు. బైర్వా రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నాడు.
ప్రేమ్ చంద్ బైర్వా ఏబీవీపీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత జైపూర్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ప్రేమ్ చంద్ బైర్వా 2013లో జరిగిన శాసనసభ ఎన్నికలలో డూడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హజారీ లాల్ నగర్ పై 33,720 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బాబు లాల్ నగర్ చేతిలో 14,779 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ప్రేమ్ చంద్ బైర్వా 2023లో డూడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బాబు లాల్ నగర్‌పై 35743 ఓట్ల తేడాతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి డిసెంబరు 12న జరిగిన బీజేపీ పార్టీ సమావేశం తర్వాత ఆయనను 12న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.