From Wikipedia, the free encyclopedia
పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో నర్సీపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
పెట్ల ఉమాశంకర్ గణేష్ | |||
ఎమ్మెల్యే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | నర్సీపట్నం నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 20 నవంబర్ 1974 కొత్తపల్లి నర్సీపట్నం మండలం విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | కళావతి | ||
బంధువులు | పూరీ జగన్నాధ్ (అన్నయ్య)[1] సాయిరాం శంకర్ (తమ్ముడు) | ||
సంతానం | అవినాష్, ఆదర్శ్ |
పెట్ల ఉమాశంకర్ గణేష్ 1974లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం మండలం, కొత్తపల్లిలో జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి 2002లో బీఏ పూర్తి చేశాడు.[3]
పెట్ల ఉమాశంకర్ 1992లో టీడీపీలో చేరాడు. ఆయన 1995 నుంచి 2001 వరకు కొత్తపల్లి సర్పంచ్‌గా, 2009 నుంచి 2012 వరకు తాండవ ఆయకట్టు సంఘం చైర్మన్‌గా పనిచేసి 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఉమాశంకర్ గణేష్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు చేతిలో 2338 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019లో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు పై 23366 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.