పాటణ్
గుజరాత్ రాష్ట్రం, పటాన్ జిల్లా పరిపాలనా ముఖ్యపట్టణం. From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్రం, పటాన్ జిల్లా పరిపాలనా ముఖ్యపట్టణం. From Wikipedia, the free encyclopedia
పాటణ్, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, పాటణ్ జిల్లా పరిపాలనా ముఖ్యపట్టణం.ఇది పరిపాలక సంఘ పట్టణం.ఇది మధ్యయుగ కాలంలో గుజరాత్ చావ్డా,చౌళుక్య రాజవంశాల రాజధానిగా పనిచేసింది.దీనిని ప్రభాస్ పాటణ్ నుండి వేరుచేయడానికి అన్హిల్పూర్-పాటణ్ అని పిలుస్తారు. గుజరాత్ సుల్తానేట్ పాలనలో,ఇది సా.శ. 1407 నుండి 1411 వరకు రాజధానిగా ఉంది.పాటణ్ను చావడా రాజు వనరాజు స్థాపించాడు.అనేక హిందూ, ముస్లిం రాజవంశాల పాలనలో,ఇది ఉత్తర గుజరాత్‌కు వాణిజ్య నగరంగా,ప్రాంతీయ రాజధానిగా అభివృద్ధి చెందింది.నగరంలో అనేక హిందూ,జైన దేవాలయాలు అలాగే మసీదులు,దర్గాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం అంతరించిపోతున్న సరస్వతీనది ఒడ్డున ఉన్న చారిత్రక ప్రదేశం.పాటణ్ నగరంలో పురాతన వాణిజ్యప్రాంతం కలిగి ఉంది.ఇది చాలా గణనీయమైంది.కనీసం వాఘేలాల పాలన నుండి నిరంతర కార్యకలాపాలు కొనసాగిందని నమ్ముతారు.
Patan
Anhilvad, Anhilpur | |
---|---|
City | |
Nickname: Patola City | |
Coordinates: 23°51′00″N 72°07′30″E | |
దేశం | India |
రాష్ట్రం | గుజరాత్ |
District | Patan |
Founded by | Vanraj Chavda |
Government | |
• Type | Patan Municipality |
విస్తీర్ణం | |
• Total | 112.84 కి.మీ2 (43.57 చ. మై) |
Elevation | 76 మీ (249 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,33,744 |
• Rank | 26th (Gujarat) |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,100/చ. మై.) |
భాషలు | |
• అధికార | Gujarati, Hindi, and English |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 384265 |
Telephone code | 02766 |
Vehicle registration | GJ-24 |
పాటణ్ను తొమ్మిదవ శతాబ్దంలో చావడా పాలకుడు వనరాజు "అనాహిలపాతక" స్థాపించాడు.[1] సా.శ. 10వ -13వ శతాబ్దంలో ఈ నగరం చావదాస్ తర్వాత వచ్చిన చౌళుక్య రాజవంశానికి రాజధానిగా పనిచేసింది.
ఘుర్ జనరల్ ముహమ్మద్, తరువాత ఢిల్లీ సుల్తాన్ కుతుబ్-ఉద్-దిన్ అయ్బక్ 1197లో కసహ్రదా యుద్ధంలో దోచుకున్నాడు. సా.శ. 1298లో అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని నాశనం చేశాడు.పాటణ్ ఆధునిక పట్టణం తరువాత అన్హిల్వారా శిథిలాల సమీపంలో ఏర్పడింది. సా.శ. 1304 నుండి 1411 వరకు,మొదటి పాటణ్ ఢిల్లీ సుల్తానేట్ సుబా ప్రధాన కార్యాలయం, 14వ శతాబ్దం చివరిలో ఢిల్లీ సుల్తానేట్ పతనం తర్వాత గుజరాత్ సుల్తానేట్ రాజధాని నగరంగా కొలసాగింది.ఈ సుబాస్చే ఒక కొత్త కోట నిర్మించబడింది, అందులో పెద్ద భాగం (కొన్ని ద్వారాలతో పాటు) ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.హిందూ రాజ్యం పాత కోట దాదాపు కనుమరుగైంది.కల్కా నుండి రాణి కి వావ్ వెళ్ళే మార్గంలో ఒక గోడ మాత్రమే కనిపిస్తుంది.సా.శ. 1411లో సుల్తాన్ అహ్మద్ షా రాజధానిని అహ్మదాబాద్‌కు మార్చాడు.
పాటణ్ నగరం,సా.శ. 18వ శతాబ్దం మధ్యకాలం నుండి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు బరోడా రాష్ట్రంలో భాగంగా ఉంది, బరోడా బొంబాయి రాష్ట్రంలో భాగమైంది.ఇది 1960లో గుజరాత్, మహారాష్ట్రలుగా విభజించబడిన కాలంలో గుజరాత్ రాష్ట్రంలో చేరింది.
చౌళుక్య రాజవంశం లేదా సోలంకీల కాలంలో, రాణి కి వావ్ లేదా రాన్-కీ వావ్ (రాణుల మెట్ల బావి) అని పిలువబడే మెట్లబావి నిర్మించబడింది.ఇది తన భర్త భీమా I (సా.శ.1022-1063) జ్ఞాపకార్థం ఉదయమతి నిర్మించిన గొప్ప శిల్పకళా స్మారకచిహ్నం.[3] ఇది బహుశా ఉదయమతి,చాలుక్య రాజ వంశీకుడు కర్ణ మరణానంతరం పూర్తి చేసి ఉండవచ్చు. సా.శ.1304లో మేరుతుంగ సూరి రచించిన ' ప్రబంధ-చింతామణి'లో ఉదయమతి స్మారక చిహ్నాన్ని నిర్మించినట్లు ప్రస్తావన ఉంది.
ఇది దాని రకమైన అతిపెద్ద,అత్యంత విలాసవంతమైన నిర్మాణాలలో ఒకటి. ఇది నీటి ప్రవాహాలవలన ఇసుకమేట వేసిింది.బావి వృత్తాకార భాగంలో కొన్ని వరుసల చెక్కిన పలకలు మినహా చాలావరకు కనిపించవు.దాని శిథిలాల మధ్య ఇప్పటికీ ఒక స్తంభం ఉంది.
మెట్ల బావి చివరి మెట్టు క్రింద ఉన్న చిన్న ద్వారం ఉంది.దాని నుండి 30 కి.మీ. సొరంగం (ఇప్పుడు అది రాళ్లు, మట్టితో మూసుకుపోయింది) ఇది పాటణ్ సమీపంలోని సిధ్పూర్ పట్టణానికి దారి తీస్తుంది.ఓటమి సమయంలో సొరంగం బాగా నిర్మించిన రాజుకు ఇది తప్పించుకునే రహస్య మార్గంగా ఉపయోగించటానికి నిర్మించబడింది.
గుజరాత్‌లోని 120 ఇతర మెట్ల బావిలలో ఈ మెట్లబావి లోతైంది, పురాతనమైంది.విష్ణువు అవతారాలు,హిందూ దేవతలు విష్ణువుకు భక్తితో, అతని అవతారాల (కృష్ణుడు,రాముడు ఇతరుల) రూపాల్లో సూచిస్తాయి. , జైన విగ్రహాలు,వారి పూర్వీకులను వర్ణించే రాణి కి వావ్ శిల్పం.[4] లాంటి చాలా శిల్పాలు ఉన్నాయి.
ఇది 2014 జూన్ 22న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరింది [5]
పాటణ్‌లో హేమచంద్రాచార్య ఉత్తర గుజరాత్ విశ్వవిద్యాలయం [6] ప్రసిద్ధ బహువిద్యావేత్త ఆచార్య హేమచంద్ర పేరు పెట్టారు.దీనిని గతంలో ఉత్తర గుజరాత్ విశ్వవిద్యాలయం అని పిలిచేవారు. పాటణ్‌లో అనేక పాఠశాలలు,కళాశాలలు ఉన్నాయి.వాటిలో షెత్ బి.డి. ఉన్నత పాఠశాల,పిపిజి ప్రయోగాత్మక ఉన్నత మాధ్యమిక పాఠశాల, జూనియర్ కళాశాల పురాతనమైనవి.పిపిజి ప్రయోగాత్మక ఉన్నత పాఠశాల, ఆదర్శ విద్యాలయ,భగవతి అంతర్జాతీయ పబ్లిక్ పాఠశాల, షేత్ ఎం.ఎన్ ఉన్నత పాఠశాల,షెత్ బి.ఎం.ఉన్నత పాఠశాల ప్రేరణ మందిర్ ఉన్నత పాఠశాల ప్రసిద్ధిపొందిన విద్యాసంస్థలు. ఇంజినీరింగ్‌లో డిప్లొమా కోసం కె.డి.సాంకేతిక కళాశాల, పాటణ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల,షెత్ ఎం.ఎన్ విజ్ఞాన కళాశాల, షెత్ ఎం.ఎన్ న్యాయ కళాశాల ఉన్నాయి.ఉత్తరగుజరాత్లో పాటణ్ ప్రసిద్ధిచెందిన ఒక విద్యా కేంద్రం.
పాటణ్ ఉత్తర గుజరాత్‌లోని ఒక ప్రముఖ వైద్య కేంద్రం. దాదాపు 200 మంది వైద్య నిపుణులు ఉన్నారు.ఇది ఉంఝా హైవేపై ధర్‌పూర్‌లో జి.ఎం.ఇ.ఆర్.ఎస్ వైద్య కళాశాల,ఆసుపత్రి, ధర్పూర్-పాటణ్ అనే వైద్య కళాశాల ఉన్నాయి. నగరంలో ప్రధాన ఆసుపత్రులలో ప్రభుత్వ ఆసుపత్రి, జనతా ఆసుపత్రి ఇతర చిన్న చిన్న వైద్యశాలలు ఉన్నాయి.
కమీషన్ ప్రతినిధి ద్వారా రైతులు,కొనుగోలుదారుల మధ్య ఇక్కడ జరిగే వ్యవసాయ ఉత్పత్తుల వేలంపాటల రూపంలో, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయి.
పటోలా చీర నేడు ఉత్పత్తి చేయబడిన అత్యుత్తమ చేతితో నేసిన చీరలలో ఒకటి. దీని ఉత్పత్తులకు పాటణ్ నగరం ప్రసిద్ధి.ఇది చాలా ఖచ్చితత్వం, స్పష్టతతో అల్లిన అత్యంత సున్నితమైన నమూనాలకు ప్రసిద్ధి చెందింది. పటోలా చీర తయారుచేయడానికి 4 నుండి 6 నెలల సమయం పడుతుంది, అలంకరణ నమూనాలు ఎంతో క్లిష్టంగా ఉంటాయి.చీరె పొడవు 5 లేదా 6 మీటర్లు ఉంటాయి.ఈ చీరలు పూర్తిగా వివిధ కూరగాయల రంగులతో ఉంటాయి.ఇది 20 వేల నుండి 2 లక్షల రేటువరకు ఉంటాయి. దానిని నేసే ప్రక్రియలో బంగారు దారాలు చేర్చటం,దాని పని కష్టాన్ని బట్టి రేట్లు ఉంటాయి.
పటోళ్ల చీరలు తయారు చేస్తున్న కుటుంబాలు రెండు మాత్రమే ఉన్నాయి. అయితే వారు ఇతరులకు ఈ కళను నేర్పించరు.వారి కుటుంబ సభ్యులకు మాత్రమే నేర్పుతారు.సాల్వివాడ్, సాంప్రదాయక మట్టి బొమ్మలు తయారుచేసే ప్రదేశాలతో పాటు పటోలాలు అల్లిన ప్రదేశం సందర్శించదగింది.అనేక వార్షిక మతపరమైన ఉత్సవాలుకు పర్యాటక కేంద్రం.గుజరాత్‌లోని స్థానిక ప్రజలు ఇది ప్రాచీనకళ అని,దీనిని సంరక్షించడంతో పాటు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందంటారు. "పాటణ్ నా పటోలా" ను గుజరాత్లో మహిళలు కొనుగోలు చేయడానికి అత్యంత ఖరీదైన వస్తువు అనిఎల్లప్పుడూ ప్రశంసిస్తారు.
నగరంలో కోటలు, మెట్ల బావులు, సరస్సులు ప్రార్థనా స్థలాలతో సహా అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.రాణి కి వావ్ (ప్రపంచ వారసత్వ ప్రదేశం), పటోలా చీరలు ప్రదర్శన ప్రధాన పర్యాటక ఆకర్షణలు.
పాత నగరమైన పాటణ్ అవశేషాలు కొత్త నగరం శివార్లలోని కల్కాకు సమీపంలో ఉన్న పాత కోటలో చాలా చిన్న భాగం.దీనికి చారిత్రక, పురావస్తు ప్రాముఖ్యత ఉఁది.అలాగే కొత్త కోటగోడల అవశేషాలు,కొత్త కోట దర్వాజాలు కనుమరుగయ్యాయి.శరవేగంగా కుంచించుకు పోతున్న ఈ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించడంలో ప్రభుత్వం,స్థానిక ప్రజల ఆసక్తి అంతగా లేకపోయింది.భద్ర లోపలి కోట దాని ద్వారాలతో బాగా సంరక్షించబడింది.
మెట్ల బావులలో రాణి కి వావ్, త్రికం బరోత్ ని వావ్ ఉన్నాయి. సరస్సులలో చారిత్రాత్మకంగా,పురావస్తుపరంగా ముఖ్యమైన సహస్త్రలింగ సరస్సు, ఆనంద్ సరోవర్, ఖాన్ సరోవర్ ఉన్నాయి.
రెండు ప్రసిద్ధ నిర్మాణ స్మారక చిహ్నాలు జాతీయ స్మారక చిహ్నాల హోదాను పొందాయి. వాటిలో ఒకటి సహస్త్రలింగ సరస్సు, మరొకటి రాణికి వావ్ మెట్లబావి. భారతదేశం,గుజరాత్ రాష్ట్రం,పాటణ్ పట్టణంలో ఉన్న రాణి కి వావ్ ఒక క్లిష్టమైన నిర్మాణ మెట్ల బావి.ఇది ఇప్పుడు ఎండిపోయిన సరస్వతి నది ఒడ్డున ఉంది.ఇది దాని ఉత్తమ కాలంలో కాలానుగుణ నది.[7]
బాగ్వాడ, ఛిడియా, మీరా, అఘారా, కొత్తకూ, ఫాతిపాల్ (ఫాతిపాల్), ఘూంఘ్డి, కనస్దా (కాళికా), ఖాన్సరోవర్, మోతీషా, భాతి, లాల్, అనే 12 ప్రసిద్ధి చెందిన ప్రధాన దర్వాజాలు, ఒక కిటికీ (నగరం మధ్యలో గణేష్ బారి అని పిలుస్తారు) నగరా చిహ్నాలుగా ఉన్నాయి.
మతపరమైన,చారిత్రాత్మకమైన లేదా నిర్మాణ సంబంధమైన ప్రాతిపదికన చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి.చాలా కాలంగా గుజరాత్ రాష్ట్ర రాజధానిగా ఉన్న ఈ నగరం మతపరమైన ప్రదేశాలతో పాటు వారసత్వ సంపదను కలిగి ఉంది.పాటణ్‌లో జైనమత వ్యాప్తిని అర్థం చేసుకోవచ్చు, ఈ నగరం జైన ఆలయాలుకు పాలిటానా,అహ్మదాబాద్ (రాజ్‌నగర్) తర్వాత సంఖ్యపరంగా మూడవ స్థానంలో ఉంది.
హిందువులు నగరంలో అతిపెద్ద మత సమాజంగా ఉంది.ఇతర తక్కువ మత సమాజాలుగా ముస్లింలు,క్రైస్తవులు,సిక్కులు,జైనులు ఉన్నారు. జనాభాలో దాదాపు 87% హిందువులు ఉన్నారు. పాటణ్ చరిత్ర జైనమతం ప్రభావిత రాష్ట్రంలో ఒకటి అని సూచిస్తుంది.
పాటణ్ పాటణ్ (లోక్‌సభ నియోజకవర్గం) పరిధిలోని గుజరాత్ శాసనసభ నియోజకవర్గం.
సమీపంలోని గ్రామాన్ని కలుపుతూ నగరంలో తిరగే బస్సుల సేవలు ఉన్నాయి.ఆటోరిక్షాలు ఇతర వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి పాటణ్ నగరం 108 కి.మీ.దూరంలో ఉంది.ఇది అహ్మదాబాద్ - భగత్ కీ కోఠి (జోధ్‌పూర్) ప్రధాన మార్గం. ఇది బి.జి. మార్గం ద్వారా మెహ్సానా,అహ్మదాబాద్,ఓఖాకు రైలు ద్వారా అనుసంధానించబడింది.పాటణ్ రైల్వే స్టేషన్ ఇప్పుడు భిల్డీ రైల్వే స్టేషన్‌తో కొత్త బి.జి. మార్గంతో అనుసంధానించబడి ఉంది.
రాజస్థాన్‌లోని రామ్‌ఘర్‌ను గుజరాత్ రాష్ట్రంతే కలిపే జాతీయ రహదారి 68 పాటణ్-చనాస్మా గుండా వెళుతుంది.తద్వారా దీనిని జైసల్మేర్, బార్మర్, రాధన్‌పూర్ నగరాలతో కలుపుతుంది.రాష్ట్ర రహదారులు 7, 10, 130 పాటణ్ గుండా వెళతాయి.గుజరాత్‌లోని సమీప నగరాలతో కలుపుతాయి. జాతీయ రహదారి 68 దీనిని మెహసానా,హిమ్మత్‌నగర్ అహ్మదాబాద్‌లతో కలుపుతుంది.
మెహసానా విమానాశ్రయం ఇది కేవలం 51 పాటణ్ నగరం నుండి కి.మీ.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.