పవిత్ర బంధం (1996 సినిమా)
1996లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా / From Wikipedia, the free encyclopedia
వెంకటేష్, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన పవిత్ర బంధం చిత్రం 1996 లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో పెళ్ళి విశిష్ట్తతను, దాని గొప్పతనాన్నీ సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించారు. సి. వెంకటరాజు, జి. శివరాజు గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు.[1][2] ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. వెంకటేష్, సౌందర్య నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నమోదైంది.[3] దాని విజయం కారణంగా, దీన్ని ఆరు ఇతర భాషలలో పునర్నిర్మించారు. కన్నడంలో మాంగల్యం తంతునానేనా (1998), హిందీలో హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై (1999), తమిళంలో ప్రియమానవలే (2000), బెంగాలీలో సాట్ పాకే బంధ (2009) ), ఒడియాలో సుహాగ్ సింధూరా (1996) గా నిర్మించారు. బంగ్లాదేశ్లో నిర్మించిన ఇ బధోన్ జబెనా చిరే (2000)లో రియాజ్, షబ్నూర్ నటించారు. కన్నడ చిత్రం అనురాగ అరలితు తర్వాత ఆరు భాషలలో రీమేక్ చేసిన రెండవ భారతీయ చిత్రంగా ఇది నిలిచింది.
పవిత్ర బంధం (1996 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
తారాగణం | వెంకటేష్, సౌందర్య |
సంగీతం | ఎంఎం కీరవాణి |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | గీత చిత్ర ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు గెలుచుకున్నచిత్రం.