పరమాణువు
రసాయన మూలకాలను నిర్వచించే పదార్థం యొక్క అతి చిన్న యూనిట్ / From Wikipedia, the free encyclopedia
ఒక పరమాణువు అనేది రసాయన మూలకాన్ని ఏర్పరిచే సాధారణ పదార్థం యొక్క అతి చిన్న యూనిట్. ప్రతి ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా పదార్థాలు తటస్థ లేదా అయోనైజ్డ్ పరమాణువులతో కూడి ఉంటాయి. పరమాణువులు చాలా చిన్నవి, అవి సాధారణంగా 100 పికోమీటర్ల పరిమాణం కలిగి ఉంటాయి. వాటి ప్రవర్తనను సాంప్రదాయక భౌతికశాస్త్రాన్ని ఉపయోగించి కచ్చితంగా అంచనా వెస్తే - అవి టెన్నిస్ బంతుల ఆకారంలో ఉంటాయి.
హీలియం పరమాణువు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
హీలియం పరమాణువు చిత్రంలో పరమాణు కేంద్రకం (పింక్), ఎలక్ట్రాన్ మేఘం విస్తరణ (నలుపు) రంగులో సూచించబడినవి. పరమాణు కేంద్రకం (పైన కుడివైపు) హీలియం-4 సాపేక్షంగా గోళాకారంగా సౌష్టవంగా ఉండి దగ్గరలో ఎలక్ట్రాన్ మేఘం ఆవరించబడి ఉంది. నలుపు బార్ "ఆంగ్స్ట్రాం"(10−10 m లేదా 100 pm). | ||||||||
వర్గీకరణ | ||||||||
| ||||||||
ధర్మములు | ||||||||
|
ప్రతి పరమాణువు పరమాణు కేంద్రకం, దాని చుట్టూ పరిభ్రమణం చేసే ఒకటి లేదా ఎక్కువ ఎలక్త్రాన్లను కలిగి ఉంటుంది. పరమాణు కేంద్రకం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోటాన్లు, అనేక న్యూట్రాన్లను కలిగి ఉంటుంది. అన్ని మూలకాలలో వలె కాకుండా హైడ్రోజన్ పరమాణువులో న్యూట్రాన్లు ఉండవు. 99.94% కంటే ఎక్కువ ద్రవ్యరాశి పరమాణు కేంద్రకంలో ఉంటుంది. పరమాణువులో ప్రోటాన్లు ధనావేశాన్ని, ఎలక్ట్రాన్లు ఋణావేశాన్ని కలిగిఉంటాయి. ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ల సంఖ్య, ప్రోటాన్ల సంఖ్యకు సమానంగా ఉంటే అది విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటుంది. పరమాణువులో ప్రోటాన్ల సంఖ్య కన్నా ఎక్కువ లేదా తక్కువ ఎలక్ట్రాన్లు ఉంటే అపుడు పరమాణువు ఋణావేశం లేదా ధనావేశాన్ని కలిగి ఉంటుంది. అటువంటి ఆవేశం గల కణాలను అయాన్లు అంటారు.
ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్లు, పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్లు విద్యుదయస్కాంత బలం వల్ల పరస్పరం ఆకర్షించబడుతూ ఉంటాయి. కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రక బలం వల్ల బంధించబడి ఉంటాయి. ఈ బలం ధనావేశం గల ప్రోటాన్ల మధ్య గల వికర్షణ బలం కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో ఈ వికర్షణ బలం కేంద్రక బలం కంటే ఎక్కువ అవుతుంది. ఈ సందర్భంలో కేంద్రకం విడిపోయి వేర్వేరు మూలకాలుగా మారుతుంది. దీనిని కేంద్రక విఘటనం అంటారు.
పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. ఇది అది ఏ రసాయమ మూలక పరమాణువో తెలుస్తుంది. ఉదాహరణకు పరమాణు కేంద్రకంలో 29 ప్రోటాన్లు కల మూలకం కాపర్ అని తెలుస్తుంది. న్యూట్రానుల సంఖ్య ఆ మూలకం ఐసోటోపులను నిర్వచిస్తుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు రసాయన బంధాల ద్వారా కలిసి అణువులు, స్ఫటికాలు వంటి రసాయన సమ్మేళనాలు ఏర్పడతాయి. ప్రకృతిలో సంభవించిన చాలా భౌతిక మార్పులకు పరమాణువుల కలయిక, విడిపోవడం కలుగుతుంది. ఈ మార్పులను అధ్యయనాన్ని రసాయనశాస్త్రం వివరిస్తుంది.