![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bd/Tandoorimumbai.jpg/640px-Tandoorimumbai.jpg&w=640&q=50)
పంజాబీ వంటకాలు
పంజాబీ ప్రాంతాల సంప్రదాయక ఆహారం / From Wikipedia, the free encyclopedia
పంజాబీ వంటకాలు భారత్, పాకిస్థాన్ దేశాల్లో విస్తరించిన పంజాబీ ప్రాంతాల సంప్రదాయక ఆహారం. తందూరీ తరహా వంట తయారీ ఈ వంటకాల్లోని ప్రత్యేక విధానం. ఈ విధానం ప్రస్తుతం భారత్ లోని మిగిలిన ప్రదేశాల్లోనే కాక, యుకె, కెనెడా వంటి ఇతర దేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. పురాతన సింధూ లోయ నాగరికతలోని జీవినవిధానం, వ్యవసాయ ప్రభావం ఈ ప్రాంతపు వంటకల్లో చాలా ఉంటుంది. ఈ వంటకాల్లో ప్రాంతీయ ప్రధాన పంటలు కీలకపాత్ర పోషిస్తాయి. శాకాహారమైనా, మాంసాహారమైనా వెన్న ఎక్కువగా వాడటంతో ఈ వంటలు చాలా రుచికరమైనవిగా ప్రసిద్ధి చెందాయి. సర్సాన్ డా సాగ్, మక్కీ డీ రోటీ వంటకాలు వీరి ప్రధాన వంటలు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bd/Tandoorimumbai.jpg/640px-Tandoorimumbai.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/32/Pakistani_gobi_aloo%2C_seekh_kebab%2C_and_beef_karahi.jpg/640px-Pakistani_gobi_aloo%2C_seekh_kebab%2C_and_beef_karahi.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/89/Mintparatha.jpg/640px-Mintparatha.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2f/Plainlassi.jpg/640px-Plainlassi.jpg)
పంజాబీ వంటకాల్లో బాస్మతీ బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్నంతో చేసే వంటల్లో ఎక్కువగా బాస్మతీ బియ్యాన్నే వాడతారు ఈ ప్రాంతం వారు. పంజాబీలో వండిన బియ్యాన్ని "చోల్" అంటారు. చాలా శాకాహార, మాంసాహార వంటల్లో ఈ బియ్యం రుచి పెంచుతుందని చెప్తుంటారు పంజాబీలు. అందుకే ఈ బియ్యాన్ని ఎక్కువగా వాడుతుంటారు.[1][2][3]