నౌపడ -గుణుపూర్ రైల్వే లైన్ వాల్తేరు డివిజన్ యొక్క ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందినది. లిహురి రైల్వే స్టేషన్ మీదుగా ఈ లైన్ ఉంది.

త్వరిత వాస్తవాలు నౌపడ-గుణుపూర్ సెక్షన్, అవలోకనం ...
నౌపడ-గుణుపూర్ సెక్షన్
అవలోకనం
స్థితిOperational
లొకేల్ఆంధ్రప్రదేశ్, ఒడిశా
చివరిస్థానంనౌపడ
గుణుపూర్
స్టేషన్లుపర్లాకిమిడి
ఆపరేషన్
ప్రారంభోత్సవం1931
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుఈస్ట్ కోస్ట్ రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు90 కి.మీ. (56 మై.)
ట్రాక్ గేజ్5 ft 6 in (1,676 mm) broad gauge
మూసివేయి

చరిత్ర

ఉత్తర ఆంధ్ర మొదటి రాయల్_లైట్ రైల్_లైన్ 1898 లో పర్లాకిమిడి మహారాజా గౌరచంద్ర గజపతి ప్రారంభించాడు. తరువాత దీనిని గుణపూర్ వరకు మహారాజా కృష్ణ చంద్ర గజపతి కాలంలో విస్తరించారు.[1] ఆవిరి యంత్రాన్ని పోలిన నౌపడ - పర్లాకిమిడికి రైలు ఇంజన్ లో ముందుగా సఖల సౌకర్యాలతో రాజు కుటుంబీకులు ప్రయాణించేందుకు ఒక కంపార్టుమెంటు, తన పరివారం, వంట సిబ్బంది ప్రయాణించేందుకు రెండు కంపార్టుమెంట్లు ఉండేవి. ఈ రైలు మార్గం నౌపడ నుండి పర్లాకిమిడికి కేవలం 40 కి.మీ దూరం మాత్రమే ఉండేది. 1898 లో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, పని పూర్తిగా ప్రారంభమైంది. రైలు ఇంజిన్ తో పాటు కంపార్టుమెంట్లు నౌపడలో ఆయన అతిథి గృహానికి వెళ్లిపోయే విధంగా రైలు పట్టాలు ఉండేవి. ఈ ఇంజిన్ నడిచేందుకు పర్లాకిమిడికి - నౌపడ ల మధ్య 225 మంది కూలీలు శ్రమించేవారు. ప్రజా రవాణా అటవీ ఉత్పత్తులకు అందుబాటుగా రైలు మార్గాన్ని వినియోగిస్తే జనరంజకంగా ఉంటుందని కృష్ణ చంద్రగజపతి భావించి1905లో పర్లాకిమిడికి నుంచి గుణుపూర్ వరకు ఈమార్గాన్నివిస్తరించాడు. 1906 లో గుణుపూర్ - నౌపడ మధ్య నెరోగేజ్ మార్గంలో ప్రజా రవాణా ప్రారంభమైంది.

ఈ రైల్వే లైన్ రూ. 700,000 ఖర్చుతో నిర్మించబడింది. ప్రారంభ సంవత్సరాలలో, పర్లాఖిమిడి రైల్వే నష్టాలను చవిచూసింది. కానీ 1910 తర్వాత అది స్వల్ప లాభాలను ఆర్జించింది. 1924-25 తర్వాత లాభాలు పెరిగాయి. ఇది 1929, 1931 లో రెండు దశల్లో గుణుపూర్ వరకు లైన్ విస్తరించడానికి రాజాను ప్రేరేపించింది. ఇది తరువాత బెంగాల్ నాగపూర్ రైల్వేలో విలీనం చేయబడింది. [1]

నౌపడా రైల్వే ఉద్యమం

1990 నుండి 1994 వరకు నౌపడా-గుణుపూర్ రైలు ఉద్యమం జరిగింది. నౌపడా-గుణుపూర్ మార్గంలో నడిచే నారొగేజి రైలును అప్పటి ప్రభుత్వం ఎత్తివేసి ఈ మార్గాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించడంతో పేడాడ పరమేశ్వరరావు నాయకత్వంలో పుట్టుకొచ్చిన ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ఐదు సంవత్సరాల కాలం సాగిన ఈ పోరాటంలో పోలీసులు అనేకసార్లు నౌపడా లోను పర్లాకిముడి లోను ఆందోళనకారులపై కాల్పులు సైతం జరిపారు. టెక్కలి, పాతపట్నం, నౌపడా, పర్లాకిముడి ప్రాంతాలు నిత్యం రైల్ రోకోలు, బందులు, ధర్నాలతో దద్దరిల్లాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తలవంచి AOJAC డిమాండ్లన్నీ అంగీకరించింది. ఎత్తేసిన నౌపడా-గుణుపూర్ మార్గంలో బ్రాడ్ గేజ్ ను నిర్మించేందుకు గుణుపూర్ నుండి రాయగడ వరకు ఆ మార్గాన్ని పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. అనుకున్న ప్రకారం నౌపడా-గుణుపూర్ మార్గంలో బ్రాడ్ గేజ్ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం విశాఖ-గుణుపూర్, పూరి-గుణుపూర్ రైళ్లు నౌపడా మీదుగా లాభాలతో నడుస్తున్నాయి. నౌపడాలో మెయిల్ హల్ట్, ప్రశాంతి, హిర ఖండ్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ల హాల్టులు కూడా సాధించారు. ఈ పోరాటం ద్వారా ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు గ్రామీణ ప్రాంతాలకు రవాణా లభించింది.

రైల్వే పునర్వ్యవస్థీకరణ

భారత స్వాతంత్య్రం తర్వాత ఇది ఆగ్నేయ రైల్వేలో విలీనం చేయబడింది. 1950 లో, మళ్లీ 1964, 1967 లో బ్రాడ్-గేజ్ మార్పిడి కోసం సర్వేలు చేపట్టబడ్డాయి. చివరకు 2002 సెప్టెంబరు 27 న నౌపడ వద్ద నౌపడ -గుణుపూర్ గేజ్ మార్పిడి పనికి శంకుస్థాపన జరిగింది. 2003 ఏప్రిల్ 1 నుండి కొత్తగా ఏర్పడిన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భాగంగా మారింది. 2004 జూన్ 9 న గేజ్ మార్పిడి కోసం లైన్ చివరికి మూసివేయబడింది. [2]

రైలు సేవలు

గేజ్ మార్పిడి తర్వాత పూరి – గుణుపూర్ ప్యాసింజర్ 2011 ఆగస్టు 22 న ప్రారంభించబడింది. [3] పలాస – గుణుపూర్ ప్యాసింజర్ 2012 జూలై 21 న ప్రారంభించబడింది. [4] విశాఖపట్నం కొత్త ప్యాసింజర్ రైలు 2013-14 రైల్వే బడ్జెట్‌లో ప్రకటించబడింది. [5]

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.