![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8b/United_States_National_Library_of_Medicine_1999.jpg/640px-United_States_National_Library_of_Medicine_1999.jpg&w=640&q=50)
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్
యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వంచే నిర్వహించబడుచున్న ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య లైబ్రరీ. / From Wikipedia, the free encyclopedia
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (ఎన్ఎల్ఎం) (The United States National Library of Medicine (NLM), బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్, డేటా సైన్స్ పరిశోధనలో పరిశోధకులకు సమాచారం ఇస్తున్న సమాచార నిలయం. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెడికల్ లైబ్రరీ. ఈ లైబరీ ఆరోగ్య సమాచారాన్ని రికార్డ్ చేయడం, నిల్వ చేయడం, తిరిగి పొందడం, భద్రపరచడంఇవ్వడం వివిధ పద్ధతుల్లో పరిశోధనను నిర్వహిస్తుంది, కావలసిన పాఠకునికి సమాచారం అందచేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) లో ఈ లైబ్రరీ ఒక భాగంగా ఉన్నది [1].
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8b/United_States_National_Library_of_Medicine_1999.jpg/640px-United_States_National_Library_of_Medicine_1999.jpg)
- నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెడికల్ లైబ్రరీ.
- సమాచార సేవలు శాస్త్రీయ ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణ ప్రజారోగ్యానికి మద్దతునిస్తాయి.
- బయోమెడికల్ డేటా సమాచారాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఎన్ఎల్ఎం కొత్త మార్గాలను రూపొందించింది.
- మెరుగైన డేటా నిర్వహణ, వ్యక్తిగత ఆరోగ్యం కోసం సాధనాలను రూపొందిస్తుంది.
- వైవిధ్య మైన డేటా నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ ను రూపొందించడంలో సహాయపడుతుంది.
- ఎన్ఎల్ఎం పరిశోధకులు, వైద్యులు, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బయోమెడికల్ డేటా విస్తారమైన సంపదను ఉపయోగించుకునేలా చేస్తుంది.