![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/e/e2/Naalaaga_Endaro_Movie_Poster.jpg/640px-Naalaaga_Endaro_Movie_Poster.jpg&w=640&q=50)
నాలాగ ఎందరో
ఈరంకి శర్మ దర్శకత్వంలో 1978లో విడుదలైన తెలుగు చలనచిత్రం / From Wikipedia, the free encyclopedia
నాలాగ ఎందరో 1978, మే 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రేమ్ రంజిత్ నిర్మాణ సారథ్యంలో ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి. నారాయణరావు, రూప, హేమసుందర్, పి.ఎల్. నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎమ్మెస్. విశ్వనాధన్ సంగీతం అందించాడు.[1] 1978 నంది అవార్డులులో నంది ఉత్తమ చిత్రం, నంది ఉత్తమ నటుడు (హేమసుందర్) అవార్డులతో పాటు ఈ సినిమాలోని పాటలకు నంది ఉత్తమ నేపథ్య గాయకుడుగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు తొలి నంది అవార్డును వచ్చింది.
త్వరిత వాస్తవాలు నాలాగ ఎందరో, దర్శకత్వం ...
నాలాగ ఎందరో | |
---|---|
![]() నాలాగ ఎందరో సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ఈరంకి శర్మ |
రచన | గణేష్ పాత్రో (కథ) ఈరంకి శర్మ (చిత్రానువాదం) |
నిర్మాత | కె. ప్రేమ్ రంజిత్ |
తారాగణం | జి. నారాయణరావు రూప హేమసుందర్ పి.ఎల్. నారాయణ |
ఛాయాగ్రహణం | బి.ఎస్. లోకనాథ్ |
కూర్పు | ఎన్.ఆర్. కిట్టు |
సంగీతం | ఎమ్మెస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | మే 8, 1978 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మూసివేయి