From Wikipedia, the free encyclopedia
ముల్లా నస్రుద్దీన్, Nasreddin (పర్షియన్ ملا نصرالدین, అరబ్బీ: جحا తర్జుమా: జొహా, نصرالدين అర్థం "విశ్వాస విజయం", టర్కిష్ నస్రెద్దీన్ హోకా, ఒక సూఫీ, హాస్యభరితమైన విద్వాంసుడు. ఇతడు మధ్య యుగంలో 13వ శతాబ్దంలో అక్సెహీర్, కోన్యా లలో సెల్జుక్ ల కాలంలో జీవించాడు.[1] కానీ దగ్గరి తూర్పు దేశాలు, మధ్యప్రాచ్యము,, మధ్య ఆసియా దేశాలు, ఉజ్బెగ్లు ముల్లా నస్రుద్దీన్ తమ వాడేనంటూ చెప్పుకొంటారు.[1][2][3][3][1][4][5][6]).
ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి - "హోద్జా", ముల్లాహ్ లేదా ఎఫెందీ వంటివి. ఇతడు ప్రసిద్ధి చెందిన విద్వాంసుడు, సూఫీ, కవి, పండితుడు. ఉయిఘుర్ టర్కీ ప్రజలలో జానపద హీరో. చైనాలో కూడా ఆఫందీ లేదా ఎఫెంటీ అనే పేరుతో ప్రసిద్ధి.[7][8][9]
నస్రుద్దీన్ పనులను చూసి ఎవరైనా ఇతనికి పిచ్చివాని క్రింద జమకట్టేవారు. కాని ఇతని చేష్టల హేతువులను చూసి పండితులు సైతం ముక్కు మీద వేలేసుకొనేవారు. ఇతను తను చేసే ప్రతి పనినీ లేదా సంభాషణనూ హేతువుతోనూ తర్కంతోనూ చేసేవాడు. సాదా సీదా జీవనం గడిపిననూ వేదాంతిగా, హాస్యరసజ్ఞుడిగా, ఛలోక్తులు విసిరేవాడిగా, విమర్శకులను సైతం మాటలుడిగేలా చేసేవాడు.
ముల్లా నస్రుద్దీన్ అనటోలియాలో జీవించాడు; 13వ శతాబ్దంలో 'సివ్రీహిసార్' లోని 'హోర్తూ' గ్రామంలో జన్మించాడు. తరువాత, అక్సెహీర్ లో స్థిరనివాసమేర్పరచుకొన్నాడు, తరువాత 'కోన్యా' కు తన నివాసాన్ని మార్చి అక్కడే మరణించాడు.[4][6]
"అంతర్జాతీయ నస్రుద్దీన్ హోద్జా ఉత్సవాలు" అక్సెహీర్లో ప్రతి సంవత్సరము జూలై 5-10 వరకూ జరుగుతాయి.[10] ఆధునిక కాలంలో ఇతని గురించి అనేక కథలూ, వివిధ తరగతులలో పాఠ్యాంశాలలోనూ చూడవచ్చును.[11] తెలుగులోనూ అనేక కథలు చూడవచ్చును. ఇతని పాత్ర చిత్రణ వివిధ భాషలలో, ఉదాహరణకు, అల్బేనియన్, అరబ్బీ, అజేరీ, బెంగాలీ, బోస్నియన్, హిందీ, పష్తో, పర్షియన్, సెర్బియన్, టర్కిష్, ఉర్దూ భాషల జానపదాలలోనూ, కథలలోనూ, హాస్య సాహిత్యాలలోనూ చూడవచ్చును. గ్రీసు లోనూ బల్గేరియా లోనూ ఇతడు ప్రసిద్దే.
నస్రుద్దీన్ కథలు ప్రపంచ మంతటా ప్రసిద్ధి, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో. నస్రుద్దీన్ కథలు వ్యంగమునకు వ్యంగోక్తులకు, హాస్యమునకు, తర్కము, విజ్ఞానానికి మచ్చు తునకలు.[12] కడుపుబ్బ నవ్వించే ఇతని కథలు, ముల్లా దో పియాజా, బీర్బల్, తెనాలి రామకృష్ణ లను గుర్తుకు తెస్తాయి.
ఇతడి కథలలో సూఫీతత్వము, వేదాంతము కానవస్తుంది. ఈ కథలకు చెందిన అతిప్రాచీన వ్రాత ప్రతి 1571లో కనుగొనబడింది.
ముల్లా నస్రుద్దీన్ కు చెందిన అనేక కథలు అనేక భాషలలో ఉన్నాయి. ఇవి ప్రపంచ మంతయూ ప్రసిద్ధి చెందినవి. ఇతని గౌరవార్థం, యునెస్కో వారు 1996-1997 వ సంవత్సరాన్ని, "అంతర్జాతీయ నస్రుద్దీన్ సంవత్సరం"గా ప్రకటించారు. యునెస్కో వారి అధికారిక సైట్
నస్రుద్దీన్ కు ఇతర అనేక నామాలతోనూ గుర్తిస్తారు. ఉదాహరణకు : 'నస్రుదీన్', 'నస్ర్ ఉద్దీన్', 'నస్రెద్దీన్', 'నసీరుద్దీన్', 'నస్త్రదీన్', 'నస్త్రదిన్', 'నస్రతీన్', 'నుస్రతీన్', , 'నస్తెదిన్'. భారతదేశం లోని సాహిత్యాలలో ఇతనికి ముల్లా నస్రుద్దీన్ లేదా ముల్లా నసీరుద్దీన్ పేరుతో పరిచయం గలదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.