నల్బరి, అస్సాం రాష్ట్రం నల్బరి జిల్లాలోని ఒక పట్టణం, పురపాలక సంస్థ. నల్బరి పట్టణం నల్బరి జిల్లాకు ప్రధాన కార్యాలయం.

త్వరిత వాస్తవాలు నల్బరి నబదీప్, దేశం ...
నల్బరి
నబదీప్
పట్టణం
Thumb
నల్బరి పట్టణం
Thumb
నల్బరి
నల్బరి
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
Thumb
నల్బరి
నల్బరి
నల్బరి (India)
Coordinates: 26.445°N 91.440°E / 26.445; 91.440
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
పరిపాలన విభాగందిగువ అస్సాం
జిల్లానల్బరి జిల్లా
Government
  Bodyనల్బరి పురపాలక సంస్థ
Elevation
42 మీ (138 అ.)
జనాభా
 (2001)
  Total27,389
భాషలు
  అధికారికఅస్సామీ
  ప్రాంతీయKamrupi dialect of Assamese
Time zoneUTC+05:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
781335, 781369
టెలిఫోన్ కోడ్03624
ISO 3166 codeIN-AS
Vehicle registrationఏఎస్-14-XXXX
Websitewww.nalbari.nic.in
మూసివేయి

పద వివరణ

నల్బరి అనే పదం నాల్, బారి అనే పదాల నుండి ఉద్భవించింది. నాల్ అనగా రకరకాల రెల్లు, బారి అనగా తోటలతో నిండి ఉంది అని అర్థం.

చరిత్ర

నల్బరి పట్టణం క్రీస్తుపూర్వం అనేక శతాబ్దాల నాటి చరిత్రను కలిగివుంది. ఈ ప్రాంతంలోని చందనం, అగరబత్తి ఉత్పత్తులు ఉత్తర భారతదేశంతో సహా ఇతర ప్రాంతాలకు అధికంగా ఎగుమతి చేయబడుతున్నాయి.[1]

భాష

నల్బరి స్థానిక భాష నల్బారియా మాండలికం. ఇది అస్సామీ భాష కమ్రుపి సమూహ మాండలికం.[2]

పురావస్తు శాస్త్రం

నల్బరి ప్రాంతం పురావస్తు కేంద్రానికి అతి ముఖ్యమైనది. నల్బరిలో కమ్రుపి రాజుల రాగి పలక శాసనాలకు సంబంధించిన వివిధ ఆవిష్కరణలు ఉన్నాయి.[3]

దర్శనీయ ప్రాంతాలు

  1. ప్లానిటోరియం, సైన్స్ సెంటర్
  2. కమ్రూప్ సంస్కృత సంజీవణి సభ
  3. బిల్లేశ్వర్ దేవాలయం
  4. హరి మందిరం
  5. శ్రీపూర్ దేవాలయం
  6. బసుదేవ్ దేవాలయం
  7. బౌద్ధ దేవాలయం

విద్య

నల్బరి సంస్కృతం చదువుకు పేరొందింది. కమ్రూప్ సంస్కృత సంజీవని సభ వంటి వివిధ సంస్కృత విద్యా సంస్థల ఉనికికి "నబదీప్" అని పిలుస్తారు. 1887లో నల్బరిలో మొదటి పాఠశాల స్థాపించబడింది. తరువాత దీనిని నల్బరి గవర్నమెంట్ గుర్డాన్ హైస్కూల్ అని పిలుస్తున్నారు. నల్బరి కళాశాల, నల్బరి సంస్కృత కళాశాల, నల్బరి కామర్స్ కళాశాల, ఎం.ఎన్.సి. బాలికా కళాశాల, బార్‌బాగ్ కళాశాల, బాస్కా కళాశాల, బర్ఖేత్రి కళాశాల, టిహు కాలేజ్, బారామా కాలేజ్, కమ్రప్ కళాశాల, ధమ్ధమ అంచాలిక్ కళాశాల, జ్ఞానపీత్ మహావిద్యాలయ, నల్బరి లా కాలేజ్, శంకర్ దేవ్ అకాడమీ, డి.ఎస్.ఆర్. అకాడమీ, స్పెక్ట్రమ్ గురుకుల్ మొదలైనవి నల్బరిలోని కొన్ని ప్రధాన కళాశాలలు. 28 ప్రాథమికోన్నత పాఠశాలలు, 145 ఉన్నత పాఠశాలలు, 276 ఇతర పాఠశాలలతో పాటు నల్బరిలో అనేక విద్యా మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

వాతావరణం

నల్బరిలో ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. చలికాలం, వేసవికాలం, వర్షాకాలం సమానంగా ఉంటాయి.

మరింత సమాచారం శీతోష్ణస్థితి డేటా - Nalbari, నెల ...
శీతోష్ణస్థితి డేటా - Nalbari
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 28.8
(83.8)
32.2
(90.0)
38.4
(101.1)
39.0
(102.2)
37.0
(98.6)
38.3
(100.9)
36.5
(97.7)
36.2
(97.2)
35.8
(96.4)
34.3
(93.7)
31.0
(87.8)
28.1
(82.6)
39.0
(102.2)
సగటు అధిక °C (°F) 23.6
(74.5)
26.2
(79.2)
30.0
(86.0)
31.2
(88.2)
31.2
(88.2)
31.7
(89.1)
31.9
(89.4)
32.2
(90.0)
31.7
(89.1)
30.3
(86.5)
27.6
(81.7)
24.7
(76.5)
29.4
(84.9)
సగటు అల్ప °C (°F) 10.3
(50.5)
12.0
(53.6)
15.9
(60.6)
20.0
(68.0)
22.7
(72.9)
24.9
(76.8)
25.6
(78.1)
25.6
(78.1)
24.7
(76.5)
21.9
(71.4)
16.7
(62.1)
11.8
(53.2)
19.3
(66.8)
అత్యల్ప రికార్డు °C (°F) 4.7
(40.5)
5.1
(41.2)
8.3
(46.9)
13.0
(55.4)
16.2
(61.2)
20.4
(68.7)
21.4
(70.5)
22.1
(71.8)
19.7
(67.5)
13.6
(56.5)
10.3
(50.5)
6.0
(42.8)
4.7
(40.5)
సగటు వర్షపాతం mm (inches) 11.9
(0.47)
18.3
(0.72)
55.8
(2.20)
147.9
(5.82)
244.2
(9.61)
316.4
(12.46)
345.4
(13.60)
264.3
(10.41)
185.9
(7.32)
91.2
(3.59)
18.7
(0.74)
7.1
(0.28)
1,717.7
(67.63)
సగటు వర్షపాతపు రోజులు 1.8 2.9 5.8 13.1 17.0 19.6 22.3 18.5 15.2 7.4 2.8 1.3 127.7
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 79 65 57 68 75 81 83 82 83 82 82 82 77
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు 226.3 214.7 220.1 201.0 192.2 132.0 124.0 161.2 138.0 204.6 231.0 232.5 2,277.6
Source: ప్రపంచ వాతావరణ సంస్థ
మూసివేయి

రవాణా

జాతీయ రహదారి 27 ద్వారా నల్బరీ పట్టణ ఉత్తర దిక్కుకు చేరుకోవచ్చు, దక్షిణాన జాతీయ రహదారి 427కు కలుపబడి ఉంది. పట్టణ కేంద్రంలో నల్బరి రైల్వే స్టేషన్ ఉంది. పట్టణానికి 60 కి.మీ.ల దూరంలో గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

రాజకీయాలు

నల్బరి పట్టణం మంగల్‌దాయి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

ప్రముఖ వ్యక్తులు

  1. అబాని చక్రవర్తి (కవి)
  2. ఆది శర్మ (మొబైల్ థియేటర్ మార్గదర్శకుడు)
  3. అంగూర్లతా డెకా (నటి, రాజకీయవేత్త)
  4. భూమిధర్ బార్మాన్ (రాజకీయవేత్త)
  5. చంద్ర మోహన్ పటోవరీ (రాజకీయవేత్త)
  6. మహాదేవ్ దేకా (బాడీ బిల్డర్)
  7. త్రైలోక్యనాథ్ గోస్వామి (సాహితీవేత్త)
  8. సీమా బిస్వాస్ (బాలీవుడ్ నటి)

ఇవికూడా చూడండి

మూలాలు

ఇతర లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.