From Wikipedia, the free encyclopedia
దాండేలి (దండేలి, డాండేలి అని కూడా పలుకుతారు) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఒక పారిశ్రామిక పట్టణం. ఉత్తర భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలు పడమటి కనుమలులో (western ghats) దట్టమైన అటవీ మధ్యలో కాళీ నది ఒడ్డున అనేక పరిశ్రమలను స్థాపించడానికి 1950-55 కాలంలో వచ్చారు. కాగితపు కర్మాగారాలు, ఇనుప ఉత్పత్తులు, సాఫ్ట్‌వుడ్ కర్మాగారాలను ఏర్పాటు చేశారు. కాళీ నది ఒడ్డున ఉన్న ఈ ఊరు ఇప్పుడు పర్యాటకానికి ప్రాచుర్యం పొందింది.[1] దాండేలి దక్షిణ భారతదేశంలో జల క్రీడలకు ప్రసిద్ధి చెందింది, ముఖ్యంగా వైట్ వాటర్ అడ్వెంచర్ రాఫ్టింగ్‌కు (white water adventure rafting) ప్రసిద్ధి చెందింది.[2] [1] ఇంతే కాకుండా దాండేలి వణ్యప్రాణులకి ప్రసిద్ధి[3] ఇక్కడి అరణ్య ప్రాంతాన్ని అంశి ప్రాంతాన్ని కలిపి ప్రొజెక్ట్ టైగర్ రిజర్వ్‌గా,[4] తరువాత 2015 లో కాళీ టైగర్ రిజర్వ్ గా[5] పేర్కొనబడింది.
దాండేలి | |
---|---|
పట్టణం (హిల్ స్టేషన్) | |
Nickname: గ్రీన్ సిటీ | |
Coordinates: 15.267°N 74.617°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | ఉత్తర కన్నడ |
తాలూకా | దాండేలి |
Government | |
• Type | ప్రజాస్వామ్య |
• Body | పురపాలక సంఘం |
విస్తీర్ణం | |
• Total | 8.5 కి.మీ2 (3.3 చ. మై) |
Elevation | 472 మీ (1,549 అ.) |
జనాభా (2011) | |
• Total | 52,108 |
• జనసాంద్రత | 6,269.06/కి.మీ2 (16,236.8/చ. మై.) |
భాషలు | |
• అధికార | కన్నడ |
• ప్రాంతీయ | కన్నడ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 581,325,581,362 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | +91 8284 |
Vehicle registration | KA-65 |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 52,069. అందులో పురుషులు 20,202, స్త్రీలు 25,867. మొత్తం జనాభాలో షెడ్యూలు కులానికి చెందినవారు 6,464,షెడ్యూలు తెగలు 1,688 ఉన్నారు.[6]
భారతదేశం నలుమూలల నుండి వచ్చిన వలసదారులు దాండేలి జనాభాలోని గణనీయమైన భాగం. వీరు ఉత్తరదక్షిణ భారత రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, గుజరాత్, ఆంధ్ర, తమిళనాడు, కేరళ నుండే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి కూడావచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కర్ణాటక అధికారిక భాష కన్నడ అయినప్పటికి దాండేలిలో ముఖ్యమైన వాడుక భాష హిందీ. అలాగే పండుగల్లో కూడా కన్నడ పండుగలే కాకుండ దసరా, రాంలీల, గణేష్ చతుర్థి, దీపావళి, రంజాన్, బక్రీద్ (ఈద్ అల్ అధా), హోళీ పండుగలు ఆ ఊరి జనాభా వైవిధ్యంను ప్రతిబింబిస్తుంది.[7]
1930 సంవత్సరం నాటికి, దాండేలి జనాభా 515 మాత్రమే. వీరు ప్రధానంగా అటవీ శాఖలో ఇంకా ప్రభుత్వ కలప మిల్లులో పని చేసేవారే. చాలా మంది నివాసీలు కొంకణి, దేవాలి, మరాఠాలు, కురుబా, లంబానీ, నీగ్రో, ముస్లిం వర్గాలకు చెందినవారు. ఈ స్థావరం కాళీ నది ఒడ్డున ఉంటూ ఒక పారిశ్రామిక పట్టణంగా అభివృద్ధి చెందింది. దీనికి ఇండియన్ ప్లైవుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, లాల్‌భాయ్ ఫెర్రో-మాంగనీస్ ఫ్యాక్టరీ, వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్, ఇండియన్ సామిల్ లాంటి అనేక సంస్థలే కాకుండా, ఈ ఊరి చుట్టూ ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు ఇంకా కాళీ నది వెంబడి వివిధ ప్రదేశాలలో విద్యుత్ ఉత్పత్తి చేసే ఆనకట్టల నిర్మాణంలో నిమగ్నమైన కర్ణాటక పవర్ కార్పొరేషన్ దాండేలిని అడవిలో ఉన్న ఒక ఊరిని పట్టణంగా తీర్చిదిద్దుతానికి కారకులు. ఆ పాత ప్రాంతాన్ని ఓల్డ్ దాండేలీ అని ఇప్పటికి పిలుస్తారు.
1936 వరకు ఇక్కడ పాఠశాల లేదు. శివాజీ నార్వేకర్, పుండాలిక్ పై, సదానంద్ గోపాల్ నడ్కర్ణి, బాలప్ప చవాన్, బాప్షెట్ అంతా కలిసి సమీప కొండపై ఒక గుడిసెలో ఒక గది పాఠశాల నిర్మించడానికి సహకరించారు. అక్కడ ఇప్పుడు ప్రభుత్వ ఉర్దూ పాఠశాల ఉంది. రామచంద్ర గణపట్ నాయక్ పాఠశాల నడుపుటకు గోకర్ణ సమీపంలోని సానికట్ట నుండి వలస వచ్చారు. పాఠశాల కేవలం 18 మంది విద్యార్థులతో ప్రారంభమైంది, వారిలో ముగ్గురు వారి గురువు ఆర్.జి.నాయక్ కంటే పెద్దవారు.1939 లో ఈ పాఠశాలను బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.
స్థానిక పురాణం ప్రకారం ఈ నగరానికి మిరాషి భూస్వాముల సేవకుడైన దండేలప్ప అనే ఒక యువకుని వల్ల వచ్చింది. అతను తన విధేయత కారణంగా ప్రాణాలు కోల్పోయిన తరువాత అతనిని స్థానికులు దేవతగా కొలవడం మొదలు పెట్టారు. ఈ ఊరికి అతని పేరుతో దాండేళీ, దాండేలి, దండేలీ అని పిలవబడసాగింది. ప్రత్యామ్నాయ పురాణం ప్రకారం, దండకనాయక అనే రాజు అడవుల గుండా వెళ్తూ ఈ ప్రాంతానికి తన పేరు పెట్టుకున్నాడు. ఇంకో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీ రాముడు సీతా లక్ష్మణులతో తిరిగిన దండకారణ్యం భాగం అని కూడా నమ్ముతారు. [8]
పులులు, చిరుతపులులు, నల్ల పాంథర్లు, ఏనుగులు, గౌర్, జింకలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు దాండేలి సహజ నివాస స్థలం.[9] [10] ఇది కర్ణాటకలోని రెండవ అతిపెద్ద వన్యప్రాణుల అభయారణ్యం. [10] దీనిని 2007 లో పులి సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. [11] ఈ అడవిలో అనేక రకాల సరీసృపాలు, ఇంకా దాదాపు 300 రకాల పక్షులు ఉన్నాయి.
లోకాధ్వానీ, దక్కన్ హెరాల్డ్, ప్రజవాణి, విజయవాణి , కరవళి ముంజావు, కన్నడ జనంతరాంగ్, సయుక్త కర్ణాటక, తరుణ్ భారత్, టైమ్స్ ఆఫ్ ఇండియా, విజయ్ కర్ణాటక, దాండేలి నక్షత్రం (ఇప్పుడు లేదు) ఇక్కడి స్థానిక వార్తా పత్రికలలో ప్రధానమైనవి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.