చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదవ తిథి దశమి. అధి దేవత - యముడు. సంస్కృత భాషలో "దశమి" అనే పదానికి అర్థం "పది". చాంద్రమానంలోని ఒక మాసంలో రెండు దశమి తిథులు వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలో, రెండవది శుక్ల పక్షంలో వస్తుంది. అనగా ఒక చాంద్ర మాసంలో దశమి పదవ రోజు, ఇరవై ఐదవ రోజు వస్తుంది. హిందూ మతంలో అనేక ప్రధానమైన పండుగలకు ఈ రోజు ముఖ్యమైనది. విజయదశమి పండుగ హిందువులకు ముఖ్యమైనది.

పండుగలు

  1. దశమి తిథితో ముడిపడి మనకు రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. ఒకటి- జ్యేష్ఠ శుద్ధ దశమి. రెండు- ఆశ్వయుజ శుద్ధ దశమి. మొదటిది దశపాపహర దశమి. రెండవది విజయదశమి. రెండూ కూడా పది రోజుల పర్వాలే. పాడ్యమితో మొదలై దశమితో ముగుస్తాయి.[1]
  2. విజయదశమి. నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు. ఇది ఆశ్వయుజ మాసములో వచ్చిన దశమి రోజు. విజయమలు లభి౦చే దశమి, విజయ దశమి అని ప్రజల విశ్వాసం.[2]
  3. వైశాఖం మాసం బహుళ దశమి రోజున హనుమజ్జయంతిగా జరుపుతారు.
  4. హనుమాన్ దీక్ష: తెలుగు రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ రోజు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు.[3]
  5. ధర్మరాజ దశమి లేదా యమ ధర్మరాజ దశమి యమధర్మరాజుకు అంకితం చేయబడిన రోజు. ఈ వ్రతాన్ని 10 వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు.[4]
  6. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్త ఆగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు.[5]

మూలాలు

వనరులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.